కర్ణాటక: శాసనసభా బడ్జెట్ సమావేశాలు జూలై 3 నుంచి ఆరంభమవుతుండగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2023–24వ సంవత్సర బడ్జెట్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ మొత్తం రూ.3.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వివిధ శాఖల మంత్రులు, సీనియర్ అధికారులతో వరుసగా సమావేశాలను నిర్వహించి ఏ శాఖకు ఎంత కేటాయింపులు అనేది చర్చించారు.
జూలై 7న కొత్త సర్కారు తొలి బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదు గ్యారెంటీ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుంటే బడ్జెట్‌కి నిధులు సమకూర్చుకోవడం కష్టతరంగానే ఉంటుంది. ఆదాయాన్ని ఇచ్చే ఎకై ్సజ్, వ్యాపార, రిజిస్ట్రేషన్, ముద్రణా శాఖలు చురుగ్గా పనిచేయాలని సీఎం సూచించారు.
ఇంతకు ముందు ఫిబ్రవరిలో బీజేపీ సర్కారులో సీఎం బొమ్మయ్ రూ.3 లక్షల 9 వేల కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు. ఆ బడ్జెట్‌లో రూ.402 కోట్లు మిగులు చూపించారు. ఈసారి మిగులు ఉంటుందా అనేది అనుమానమే. బొమ్మయ్ బడ్జెట్ కంటే పెద్ద పద్దు ప్రకటించాలని సిద్దరామయ్య భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment