కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ అని జోస్యం చెబుతున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. దాన్ని నిర్ణయించేది ప్రజలేనని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మా బాధ్యతను మరింత పెంచింది. మేము కొన్ని హామీలతో ప్రజల వద్దకు వెళ్లాం, ముందు వాటిని నెరవేర్చాలన్నారు. ముందుగా ప్రజల కోసం పనిచేయాలి..ఆ తర్వాత ఏం జరుగుతుందో వారే చెబుతారని అన్నారు.
అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేలా ప్రతిపక్షాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడని వాళ్లను, ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించే రాజకీయాలు ఇకపై దేశంలో పనిచేయవన్నారు. అలాంటిదే హిమాచల్‌లో కూడా చూశామని అన్నారు. కన్నడ ప్రజలు తమ సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారాన్ని కనుగొనే వారినే కావాలనుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి వ్యతిరేకమని చెప్పేందుకు సంకేతమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ఇది మైలురాయి అవుతుందన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తామని, రాహుల్ గాంధీనే నెక్స్ట్ ప్రధాని అవుతారని భావిస్తున్నా అని సిద్ధరామయ్య అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్నారు.
కర్ణాటకలో పేదలు క్రోనీ క్యాపిటలిస్టులను ఓడించారు. ఈ ఎన్నికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, మనం ద్వేషంతో యుద్ధం చేయలేదు. ప్రేమతో ఎన్నికల్లో పోరాడామని అన్నారు. కాగా, కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, ఉండగా, బీజేపీ 66 స్థానాల్లో గెలుచుకుంది.
(చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ)
Comments
Please login to add a commentAdd a comment