
సాక్షి,బళ్లారి: జిల్లాలోని బళ్లారి రూరల్, కంప్లి నియోజకవర్గాల నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మామా అల్లుళ్లు, మంత్రి శ్రీరాములు, టీహెచ్ సురేష్‌బాబు శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇద్దరు ఓటమి చెందారు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకపారి లోక్‌సభ సభ్యుడిగా, నాలుగు సార్లు మంత్రిగా పని చేసిన శ్రీరాములు, 2008, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సురేష్‌బాబు 2018, 2023లో వరుసగా రెండుసార్లు ఓటమి చెందడం గమనార్హం.