
మాట్లాడుతున్న గాలి జనార్ధన్‌రెడ్డి
గంగావతి రూరల్: కేఆర్‌పీపీ వ్యవస్థాపకులు, గంగావతి అసెంబ్లీ అభ్యర్థి గాలి జనార్ధన్ రెడ్డికి 65,791 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారికి 57,674 ఓట్లు లభించడంతో 8,368 ఓట్ల మెజార్టీతో గాలి జనార్ధనరెడ్డి గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థి పరణ్ణ మునవళ్లి 28,918 ఓట్లు మాత్రమే పొంది మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఫలితాల అనంతరం జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం సమస్త నియోజకవర్గ ప్రజలదన్నారు. అసెంబ్లీలో తమ గళం వినిపిస్తామన్నారు. ప్రజలకు ఉత్తమ పాలన అందించి వారి రుణం తీర్చుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment