
కాంగ్రెస్‌కు చారిత్రక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని కొనియాడారు.
కర్ణాటక ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేందుకు ఈ తీర్పు నిదర్శమన్నారు. ఈ ఫలితం దేశాన్ని ఏకం చేసే రాజకీయాలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు.
అలాగే కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు.
कांग्रेस पार्टी को ऐतिहासिक जनादेश देने के लिए कर्नाटका की जनता को तहे दिल से धन्यवाद। ये आपके मुद्दों की जीत है। ये कर्नाटका की प्रगति के विचार को प्राथमिकता देने की जीत है। ये देश को जोड़ने वाली राजनीति की जीत है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 13, 2023
कर्नाटका कांग्रेस के तमाम मेहनती कार्यकर्ताओं व नेताओं को मेरी…
కాంగ్రెస్ విజయంపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే స్పందించారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. బలవంతులకు, పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలే గెలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు.
చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే..