సాక్షి, కర్ణాటక: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో తను చెప్పిందే జరిగిందని, మా అంచనాల మేరకు విజయం సాధించామన్నారు.
‘‘మోదీ వచ్చినా ఏమీ కాదని ముందే చెప్పా. కాంగ్రెస్‌కు 130 సీట్లు వస్తాయని ముందే చెప్పాం. కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్‌గా ఉంది. వ్యక్తిగతంగా నాకు మద్దతుదారులు లేరు. 2008, 2018లో బీజేపీకి ప్రజలు అధికారం ఇవ్వలేదు. రెండు సందర్భాల్లోనూ ఆపరేషన్ కమల నిర్వహించారు. భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చారు’’ అని ఆయన మండిపడ్డారు.
‘‘జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. గతంలో కాంగ్రెస్‌కు దెబ్బకొట్టిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. మా పార్టీ తరపున గెలిచి మాకు చేయిచ్చారు. పార్టీ ఫిరాయించినందుకు వారికి శాస్తి జరిగింది. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక ప్రజలు లౌకిక రాజ్యాన్నే కోరుకుంటారు మతతత్వ పార్టీ బీజేపీని ప్రజలు దూరం పెట్టారు’’ అని సిద్ధరామయ్య అన్నారు.
#WATCH | It is a mandate against Narendra Modi, Amit Shah and JP Nadda. PM came to Karnataka 20 times; No PM in the past campaigned like this: Congress leader Siddaramaiah on his party's victory in Karnataka elections pic.twitter.com/bNk1HMLk4y
— ANI (@ANI) May 13, 2023
చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment