Karnataka New CM Siddaramaiah Personal And Political Career - Sakshi
Sakshi News home page

Siddaramaiah: సీఎం సిద్ధూ.. న్యాయవాది నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

Published Thu, May 18 2023 3:44 PM | Last Updated on Sat, May 20 2023 4:18 PM

Karnataka New CM Siddaramaiah Personal And  Political Career - Sakshi

కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ఈరోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠం కోసం చివరి వరకు పోరాడిన రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంతోపాటు నూతన కేబినేట్‌ శనివారం కొలువుదీరింది.

కాగా 75 ఏళ్ల సిద్ధరామయ్య కర్ణాటక 24వ సీఎంగా  బాధ్యతలు ప్వీకరించారు. రాజకీయాల్లో 45 ఏళ్ల సుధీర్ఘ అనుభవం అన్న ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పూర్తికాలం పదవిలో ఉన్న మూడో వ్యక్తి కూడా. గతంలో దేవరాజ్ అర్స్, ఎస్‌. నిజలింగప్ప మాత్రమే అయిదేళ్ళు పూర్తి చేశారు. 1956 నుంచి తీసుకుంటే.. ఇప్పటి వరకు కేవలం ముగ్గురు వ్యక్తుల మాత్రమే పూర్తికాలం పదవిలో కొనసాగారు. వారంతా కాంగ్రెస్‌కు చెందినవారే కావడం విశేషం.

చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌.. తెర వెనక సోనియా గాంధీ!

చదువు, కుటుంబం
నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న సిద్ధరామయ్య జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న ఆయన తరువాత అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు 1947 ఆగస్టు 3న సిద్దరామే గౌడ, బోరమ్మసిద్ధరామయ్య మైసూరు జిల్లాలోని సిద్దరమణహుండి అనే చిన్న గ్రామంలో జన్మించారు. వ్యవసాయం నేపథ్యం గల కుటుంబానికి చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు  సిద్దరామే గౌడ, బోరమ్మ.  సిద్ధరామయ్య అయిదుగురు తోబుట్టువులలో రెండవవాడు. వీరు కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు.

సిద్ధరామయ్య పదేళ్ల వయస్సు వరకు పాఠశాలకు వెళ్లి ఎలాంటి విద్యను అభ్యసించలేదు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. సిద్ధరామయ్యకు పార్వతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. రాజకీయ వారసుడిగా భావించిన పెద్ద కుమారుడు రాకేష్(38) మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో 2016లో మరణించాడు. రెండవ కుమారుడు యతీంద్ర మైసూరులోని వరుణ జిల్లా నుండి 2018 శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికలో పోటీ చేయలేదు. 
చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్‌ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్‌

రాజకీయ నేపథ్యం
సిద్ధరామయ్య తన కాలేజీ రోజుల్లోనే వాక్చాతుర్యంతో మంచి వక్తగా పేరుగాంచారు.మైసూరు జిల్లా కోర్టులో  చిక్కబోరయ్య అనే న్యాయవాది దగ్గర జూనియర్‌గా పనిచేస్తన్న సమయంలో  నుంజుడ స్వామి పరిచయమయ్యారు. అతనే సిద్దారమయ్యను రాజకీయాల్లోకి రమ్మని, మైసూరు తాలుకా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన సిద్ధరామయ్య ఎన్నికల బరిలో దిగి తొలిసారి విజయం సాధించాడు. 

1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగు
తరువాత 1983లో భారతీయ లోక్‌దళ్‌ పార్టీ టికెట్‌పై చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టాడు. వ్యవసాయం, నిరాడంబర నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య తన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచి, పాత మైసూరు ప్రాంతంలో సంచలనంగా మారారు. అనంతరం జనతా పార్టీలో చేరి కన్నడ అధికార భాషగా అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కన్నడ నిఘా కమిటీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. తిరిగి 1985లో మరోసారి చాముండేశ్వరీ నుంచి కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఏకంగా రామకృష్ణ హెగ్డే  కేబినెట్‌లో పశువైద్య సేవల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు.

పార్టీ సెక్రటరీ జనరల్‌, ఆర్థిక మంత్రిగా
1992లో జనతాదళ్ సెక్రటరీ జనరల్‌గా ఎంపికయ్యారు. తిరిగి 1994లో హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. పార్టీ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. 1996లో జేహెచ్‌ పటేల్‌ ముఖ‍్యమంత్రి ఉన్న కాలంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయినప్పటికీ1999లో మంత్రివర్గం నుంచి తొలగించారు. మొత్తం తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చదవండి: ఈ నిర్ణయం కోర్టు తీర్పులాంటిది: డీకేఎస్‌

జేడీఎస్‌లో సిద్ధరామయ్య
1999లో జనతాదల్‌ నుంచి విడిపోయి హెచ్‌డీ దేవెగౌడ తన వర్గం వారితో జనతాదళ్‌(సెక్యులర్‌) పార్టీని స్థాపించారు. సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు. కానీ అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో సిద్ధరామయ్య ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 2005లో దేవెగౌడతో విభేదాల కారణంగా జేడీఎస్‌ను వీడి.. ఏడాది తర్వాత సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2006లో జరిగిన ఉపఎన్నికల్లో చాముండేశ్వరీ నుంచి కేవలం 257 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత నియోజకవర్గం మార్చుకుని 2008, 2013 ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2013 నుంచి 2018 వరకు సీఎంగా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు.

13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌
అంతేగాక కర్నాటక ఆర్థిక మంత్రిగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.ఇక తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ద్ధరామయ్య 2018 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయగా మైసూరులోని చాముండేశ్వరిలో జేడీ(ఎస్) అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. కానీ బాదామి నియోజవర్గంలో విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement