దొడ్డబళ్లాపురం:ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తాను ఇంట్లో కూర్చునే రకం కాదని, ప్రజలకు అందుబాటులో ఉంటానని నిఖిల్ కుమారస్వామి అన్నారు. గురువారం చెన్నపట్టణలో మాట్లాడిన నిఖిల్ ఎన్నికలు అన్నాక ఎవరో ఒకరు గెలవాలన్నారు. ఈరోజు తాను ఓటమిపాలైనా ఏదో ఒకరోజు గెలిచితీరుతానని, అప్పటి వరకూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు.
అయినా చెన్నపట్టణలో కుమారస్వామిని గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. రామనగరలో తనకు 76 వేల ఓట్లు వచ్చాయని, తాను టెక్నికల్‌గా ఓడిపోయినా అంతమంది జనం తనతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు రాత్రికి రాత్రి అమాయక ప్రజలకు కూపన్ ఓచర్లు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారన్నారు. తన కుటుంబం అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజలకు సేవలందిస్తాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment