
మైసూరు: నగరంలోని కేఎంపీకే చారిటబుల్ ట్రస్టు, అపూర్వ స్నేహ బృందం సభ్యులు మే 10న జరిగే విధానసభ ఎన్నికల పోలింగ్‌లో స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రత్యేకంగా ఓటర్లకు ఆహ్వాన పత్రికలు అందించారు.
పెళ్లిపత్రిక తరహాలో ఒక పత్రికను ముద్రించి సిద్ధం చేసి ఓటర్లకు పంపిణీ చేశారు. పూల విక్రేతలు, పండ్ల వ్యాపారులు, మహిళలు ఇలా వ్యాపారులందరికి ఆహ్వాన పత్రికను అందించారు. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని ఈ ఆహ్వాన పత్రికను ఇచ్చారు.