
అర్బన్: నగర నియోజకవర్గంలో తనను ప్రజలు ఆదరించారని, తన గెలుపు ఖాయమని కేఆర్‌పీపీ అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలో ప్రచార కార్యక్రమాల్లో పర్యటించినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా పలకరించి ఆదరణ చూపారన్నారు. 68.22 శాతం పోలింగ్ నమోదు కాగా నగరంలో మహిళలంతా తమ వైపే ఉన్నారనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.