సాక్షి,న్యూఢిల్లీ: కన్నడ నాట కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా కీలకవ్యాఖ్యలు చేశారు. లాస్ ఎంజెల్స్‌లో ఉన్న తాను కాంగ్రెస్ అఖండ విజయం గురించి విన్నానంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు,సామాజిక సామరస్యం లాంటివే కొలమానాలని పేర్కొన్నారు.
Just woke up to the news in Los Angeles that @INCIndia got a resounding mandate from the people of Karnataka. Infrastructure development, economic prosperity & social harmony are the metrics that people will measure to elect its representatives.
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) May 13, 2023
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగులేని మద్దతు, విశ్వాసం ప్రకటించిన ప్రజలకు డీకే శివకుమార్ ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు, హామీలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Immensely grateful to our people in Karnataka for their unwavering support and faith in Congress Party.
— DK Shivakumar (@DKShivakumar) May 13, 2023
I dedicate this victory to all of you and I promise that we shall implement our guarantees immediately to safeguard the future of our beloved Karnataka.
Once again, thank… pic.twitter.com/6ZVfvwyLFw
కాగా అధికార బీజేపీకి భారీ షాకిస్తూ శనివారం వెలువడిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడిగులందించిన స్పష్టమైన మెజార్టీని ప్రశంసిస్తూ పలువురు రాజకీయపార్టీల నేతలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment