
సంతోష్‌లాడ్, వినయ్‌కులకర్ణి, కోనరెడ్డి(పైన), ప్రసాద్ అబ్బయ్య(కింద)
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వంలో ఎవరికి మంత్రిగిరి దక్కనుందోననే ఊహగానాలు జోరందుకున్నాయి. 7 క్షేత్రాల్లో 4 స్థానాలు సాధించిన హుబ్లీ ధార్వాడ తూర్పు, ధార్వాడ గ్రామీణ, కలఘటిగి, నవలగుంద క్షేత్రాల్లో కాంగ్రెస్ జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో సంతోష్‌లాడ్ 2008, 2013, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వినయ్ కులకర్ణి 2004, 2013, 2023ల్లో జయభేరి మోగించారు. ఇక హుబ్లీ ధార్వాడ తూర్పు నియోజకవర్గంలో ఎస్టీ రిజర్వ్‌డు అభ్యర్థి ప్రసాద్ అబ్బయ్య ఏకంగా హ్యాట్రిక్ సాధించారు.
వీరిలో సంతోష్‌లాడ్, వినయ్ కులకర్ణి 2013లో సిద్దరామయ్య సర్కారులో కేబినెట్ మంత్రులుగా పని చేశారు. ఆ సమయంలో ప్రసాద్ అబ్బయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిగిరి దక్కలేదు. దీంతో అప్పట్లో ఆయన తీవ్ర అసంతృప్తి చెందగా చివరికి కొద్ది కాలం పాటు జగ్జీవన్‌రామ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్యక్షగిరితో సరిపెట్టారు. ఇక నవలగుంద నుంచి సీనియర్ నేత ఎన్‌హెచ్ కోనరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరి ఘనవిజయం సాధించారు. అందువల్ల ఈ నలుగురిలో ఎవరికి మంత్రిగిరి దక్కనుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment