
క్యూలో నిలబడి ఓటు వేసిన కలెక్టర్ పవన్ కుమార్
సాక్షి,బళ్లారి: ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో పెళ్లి పీటల నుంచి ఓ వరుడు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. బుధవారం బీదర్‌లో పెళ్లి జరిగిన అర్థ గంటకే వరుడు పెళ్లి దుస్తుల్లోనే నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బళ్లారి నగరంలో జిల్లాధికారి ఎం.పవన్ కుమార్ సరళాదేవి కళాశాలలో ఓ సామాన్యుడి తరహాలో క్యూలో నిలబడి తన ఓటు వేశారు. గ్రామీణ నియోజకవర్గంలోని కమ్మరచేడుకు చెందిన సంజమ్మ, రత్నమ్మ అనే 108, 103 ఏళ్ల వృద్ధులు ఓటు వేశారు.