
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ
గౌరిబిదనూరు: నియోజక వర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన కెహెచ్ పుట్టస్వామిగౌడ తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సౌలభ్యాలు అందేలా చూస్తానని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజలను అనవసరంగా తిప్పుకోకూడదని, ఈ విషయంపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
నియోజక వర్గంలో పరిశ్రమలు, విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తానన్నారు. తాలూకాలో అవినీతి పెచ్చు పెరిగింది, దానిని నియంత్రించడానికి కఠిన చర్యలు చేబడతానన్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతిరెడ్డి మాట్లాడుతూ... నియోజక వర్గంలో రెండు దశాబ్దాలుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ అధ్యక్షుడు హోసూరు మంజునాథ్, జీకే సతీశ్, కాంతరాజు, రాఘవేంద్ర హనుమాన్, లక్ష్మణరావ్, అనంతరాజు, శ్రీనివాసగౌడ, నాగార్జున, ఢిల్లీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment