cash carrying
-
డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్ తెలుసా?
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.ఎంత తీసుకెళ్లొచ్చు?నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.లగేజీ బరువు ఎంత ఉండాలి?విమానంలో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.ఏవి తీసుకెళ్లకూడదు?విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు. -
రూ.3 కోట్ల నగదు పట్టివేత
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా)/ఆదోని సెంట్రల్: జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న రూ.2,07,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విభీషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, తుని నుంచి విశాఖ వెళ్తున్న ఒక కారును ఆపి చూడగా లోపల ఐదు బ్యాగుల్లో రెండుకోట్ల ఏడు లక్షల యాభైవేలరూపాయల నగదు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు,యాదవరాజు కారులో ఈ నగదు తీసుకెళ్తున్నట్లుతెలిపారు. తాము ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు వీరు చెప్పారని, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదన్నారు. నగదుతోపాటు, కారును కూడా సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రూ. కోటి నగదు స్వాదీనం రైల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చసుకున్నట్లు రైల్వే డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి దాటాక రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఆదోని పట్టణానికి చెందిన కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తి నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ ఆదోనిలో దిగాడని, రైల్వే పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా రూ.1,00,95,450 నగదు గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అతడు నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు అందజేయలేదన్నారు. స్వా«దీనం చేసుకున్న నగదును నిబంధనల మేరకు ఆదాయపు పన్నుశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులు 9440627669 నంబర్‌కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు. -
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో ఎన్నికల వేళ తనిఖీలు..
బొమ్మనహళ్లి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో విస్తృతంగా సాగుతున్న తనిఖీల్లో ఒకేసారి భారీఎత్తున నగదు పట్టుబడింది. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ నియోజకవర్గం వీరసంద్ర చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం ఎన్నికల స్క్వాడ్ తనిఖీలలో రూ.4 కోట్ల 75 లక్షల నగదు లభించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన మూడు వాహనాలను తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నగదును తరలిస్తున్నవారి వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ అధికారులకు సమాచారమిచ్చామన్నారు. దావణగెరె తాలూకా హెబ్బాల చెక్‌పోస్టు వద్ద ఎన్నికల సిబ్బంది తనిఖీల్లో బీఎండబ్ల్యూ కారులో తరలిస్తున్న రూ.39 లక్షల విలువైన 66 కేజీల వెండి పాత్రలు లభించాయి. చెన్నై నుంచి ముంబైకి వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కారు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందినదిగా భావిస్తున్నారు. కారును, వస్తువులను సీజ్ చేసి విచారణ చేపట్టారు. -
డబ్బు తరలింపులో రోజుకో కొత్త మార్గం
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. కార్లలో డబ్బులు తీసుకెళ్తుంటే పోలీసులు అణువణువూ గాలించి మరీ పట్టేసుకుంటున్నారు. కనిపించిన ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు డబ్బులు పంపడానికి ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారు. మోటార్ సైకిళ్ల మీద వెళ్లే వారిని పెద్దగా పట్టించుకోవట్లేదన్న భావనతో, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలా వెనకాల ల్యాప్‌టాప్ బ్యాగులు తగిలించి, వాటిలో కంప్యూటర్లకు బదులు డబ్బులు పెట్టి పంపుతున్నారు. ఈ విషయం పోలీసులకు ఎలా లీకైపోయిందో గానీ, వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టేశారు. మోటార్ సైకిళ్ల మీద వెళ్లేవాళ్లను కూడా వదలకుండా గాలించడం మొదలుపెట్టారు. ఇలాగే హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ ప్రాంతంలో మోటార్ సైకిళ్ల మీద వెళ్లేవారిని తనిఖీ చేస్తుండగా, ఒకరి వద్ద 30 లక్షల రూపాయలు దొరికాయి. ఎన్నికల సందర్భంగా పంచిపెట్టేందుకు భారీమొత్తంలో తీసుకెళ్తున్న సొమ్మును పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. పాతబస్తీలో ఇటీవల ఏకంగా కోటి రూపాయలకు పైగా నగదు, రెండు కిలోల బంగారం కూడా పట్టుకున్న విషయం తెలిసిందే. కార్లు, ద్విచక్ర వాహనాలు అయిపోవడంతో ఇక ఇప్పుడు సిటీ బస్సుల్లోనో, ఇంటర్ సిటీ బస్సుల్లోనో నగదు తరలించేందుకు ప్రయత్నాలు చేయొచ్చని, వాటిని కూడా తాము సమర్ధంగా అడ్డుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.