నక్కపల్లి(అనకాపల్లి జిల్లా)/ఆదోని సెంట్రల్: జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న రూ.2,07,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ విభీషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, తుని నుంచి విశాఖ వెళ్తున్న ఒక కారును ఆపి చూడగా లోపల ఐదు బ్యాగుల్లో రెండుకోట్ల ఏడు లక్షల యాభైవేలరూపాయల నగదు లభించిందన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు,యాదవరాజు కారులో ఈ నగదు తీసుకెళ్తున్నట్లుతెలిపారు. తాము ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు వీరు చెప్పారని, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదన్నారు. నగదుతోపాటు, కారును కూడా సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రూ. కోటి నగదు స్వాదీనం
రైల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చసుకున్నట్లు రైల్వే డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి దాటాక రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఆదోని పట్టణానికి చెందిన కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తి నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ ఆదోనిలో దిగాడని, రైల్వే పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా రూ.1,00,95,450 నగదు గుర్తించినట్లు తెలిపారు.
విచారణలో అతడు నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు అందజేయలేదన్నారు. స్వా«దీనం చేసుకున్న నగదును నిబంధనల మేరకు ఆదాయపు పన్నుశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులు 9440627669 నంబర్‌కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment