ఎంవీఐగా బదిలీకి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణ
రవాణా మంత్రి, ఉన్నతాధికారుల పేరిట వసూళ్లు
ఆరోపణలున్నా సీఎం ఆమోదముద్ర
సాక్షి, హైదరాబాద్: రవాణా చెక్‌పోస్టుల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ), అసిస్టెంట్ ఎంవీఐ పోస్టింగ్‌ల కోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోలేదు. 8 మంది ఎంవీఐ, 20 మంది ఏఎంవీఐలను చెక్‌పోస్టుల్లో నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బదిలీకి రూ. 20 లక్షలు ఉద్యోగుల నుంచి వసూలు చేశారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయన్న సంగతి విదితమే. పదోన్నతులతో,.. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులు దాదాపు 28ఖాళీలు ఏర్పడ్డాయి.
ఆదాయం ఆర్జనకూ అవకాశం ఉన్నందున ఈ పోస్టులకు భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా రవాణా శాఖలోని కొంత మంది దళారుల అవతారం ఎత్తారు. రాష్ట్ర రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, కొంతమంది ఉన్నతాధికారుల పేరిట పోస్టింగ్‌లు కోరేవారినుంచి భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రమోషన్లు జరిగిన వెంటనే అధికారులు రూపొందించిన బదిలీల జాబితాను రద్దు చేసి, సొమ్ము ఇచ్చిన ఆశావహులతో బదిలీల జాబితా రూపొందించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కూడా, ఇదే జాబితాకు ఆమోదం తెలిపినట్లు రవాణా శాఖ కమిషనరేట్‌లో చెప్పుకొంటున్నారు.
చెక్‌పోస్టుల్లో ఈ పోస్టు మరీ ఖరీదు!
Published Tue, Nov 26 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement