సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని తడ మండలం భీములవారిపాళెం ఉ మ్మడి తనిఖీ కేంద్రంలో అవినీతి కలెక్షన్ కింగ్స్ మరిం త రెచ్చిపోతున్నారు. ఎన్నిసార్లు అవినీతి నిరోధకశాఖ దాడులు చేసినా.. వారిపై చర్యలు తీసుకోక పోవడం తో ఇక్కడ అవినీతి కార్యకలాపాలు యథాతధంగా కొనసాగుతున్నాయి. ఏసీబీ దాడుల్లో చిన్న చేపలు మాత్రమే వలలో పడుతున్నాయి. పది రోజుల క్రమం లో రెండు సార్లు ఏసీబీ దాడులు చేసింది.
రెండోసారి దాడుల్లోనూ సూమారు రూ.60 వేల అక్రమ సం పాదన దొరికింది. ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్‌పోస్టు పై ఏసీబీ దాడులు నిర్వహించారు. వారం రోజుల గడువులో శనివారం అర్ధరాత్రి దాటాక మళీ అదే తరహాలో ఏసీబీ అధిక ారులు దాడులు చేశారు. ప్రణాళికా ప్రకారం వేషాలు మార్చి నా లుగైదు బృందాలుగా విడిపోయి ఏసీబీ దాడులు నిర్వహించినా పెద్ద తిమింగలాలు మాత్రం తప్పిం చుకున్నాయి. ఏసీబీ దాడుల్లో ప్రైవేట్ వ్యక్తులు, ఎక్సై జ్‌శాఖ కానిస్టేబుళ్లు మాత్రమే పట్టుబడ్డారు. అధికారులు, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులను నియమిం చుకుని చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లో అక్రమ సంపాదన దాస్తు న్నారని తెలుస్తోంది. ఇక్కడ వెలసిన దుకాణాలను చూస్తే ఇదో మాయాబజార్‌లా కనిపిస్తోంది. ఏ దుకాణంలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై- కోల్‌కత్తా ఏషియన్ హైవే- 45 నాలుగులేన్ల రోడ్డుగా విస్తరిం చడంతో రెండు వైపులా చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం, చెక్‌పోస్టు నుంచి కిలో మీటరు దూరం మేర దుకాణాలు ఏర్పాటు చేయడంతో అంతా అయో మయంగా తయారైంది. చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో దుకాణాలు ఉండటంతో ఎవరు చెక్‌పోస్టు సిబ్బందో.. ఎవరు ప్రైవేట్ వ్యక్తులో.. ఎవరు అధికారులో తెలుసు కోలేని పరిస్థితి దాపురించింది. ఇక్కడ పనిచేసే అధి కారులు, సిబ్బంది బయటకు వచ్చే పరిస్థితి లేకపో వడంతో రోడ్డుమీద ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం విప రీతంగా పెరిగి పోయింది.
ఇక్కడ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమ వసూళ్లకు, అక్రమంగా వచ్చిన సంపాదన దాచి పెట్టేందుకు ఉపయోగించు కుంటున్నారు. ఇలా అక్రమ సంపా దనను దాచిపెట్టి అప్పగించేందుకు దుకాణదారులకు, ప్రైవేట్ వ్యక్తులకు పర్సంటేజీలు ఇవ్వడంతో రోజుకోక కొత్త దుకాణం వెలుస్తోంది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు చెక్‌పోస్టు అధికారులకు రహస్య ఏజెంట్లుగా పని చేస్తుండగా, మరికొందరు స్థానిక బలంతో వాహ నాలను సరిహద్దులు దాటించి రెండు చేతులా సంపా దించుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇక్కడ దాదాగిరి ఏ స్థాయిలో ఉందంటే.. చెక్‌పోస్టు అధికారులను సైతం శాసిస్తున్నారు. చెక్‌పోస్టు ఆదాయానికి మించి ప్రైవేట్ వ్యక్తులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ నెల 20 తేదీ వేకువ జామున జరిపిన ఏసీబీ దాడుల్లో ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను, ఇద్దరు ఎక్సైజ్ కాని స్టేబుళ్లును పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 1.07 లక్ష అక్రమ సంపాదనను స్వాధీనం చే సుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన మరోసారి దాడిలో సుమారు రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగి న ఏసీబీ దాడుల్లో కూడా రూ.1.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలల కాలంలో రెండు సార్లు దాడులు చేయగా లక్ష రూపాయలకు పైగానే పటు ్టబడింది. గడిచిన ఐదేళ్లుగా జరిగిన ఏసీబీ దాడులను పరిశీలిస్తే 2009లో రూ. 50 వేలు, 2010లో రూ.26 వేలు, 2011లో రూ. 33 వేలు, 2012 జూలైలో రూ. 55 వేలు, ఆగస్టులో రూ. 56 వేలు, 2013 అక్టోబర్ లో రూ.1.16 లక్షలు అక్రమ వసూళ్లను పట్టుకున్నారు. అయినా ఎవరిమీద చర్యలు తీసుకున్న దాఖాల్లేవు. చెక్‌పోస్టు నుంచి వస్తున్న అక్రమ వసూళ్లు జిల్లా అధికారుల నుంచి రాష్ర్ట స్థాయిలో అధికారులకు, రాజకీయ నాయకులకు నెల మామూళ్లు చేరు తుం డటంతో ఎవరి మీద చర్యలు లేకుండా పోయాయనేది బహిరంగ రహస్యమే.
అక్రమ సంపాదన కోసమే ఎక్సైజ్ శాఖ
చెక్‌పోస్టులో అక్రమ సంపాదన కోసమే ఎక్సైజ్ శాఖను ఏర్పాటు చేశారు. వీరికి ఎలాంటి విధులు లేవు. చెక్‌పోస్టు దూరంగా చిన్నపాటి పాక వేసుకుని ప్రత్యేకంగా వసూళ్లు చేస్తున్నారు. వాస్తవంగా అయితే తమిళనాడు నుంచి మద్యం అక్రమ రవాణా చేసినా, రెక్టిఫైడ్ స్పిరిట్ అక్రమ రవాణాను నిరోధించడం కోసం ఈ శాఖను ఏర్పాటు చేశారు.
కాని ఇక్కడ విధులు నిర్వహించే వారికి పనే లేకపోవడంతో చెక్‌పోస్టుకు ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద కూర్చు ని పన్నులు చెల్లించని వాహనాలపై దృష్టి సారించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్ని సార్లు ఏసీబీ దాడులు జరిగినా.. వీరిపై దృష్టి సారించే వారు కాదు. వీరిపై కూడా కన్ను వేసి ఇటీవల దాడులు చేయడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వద్ద రూ.3,700 అక్రమ సంపాదన లభించడంతో స్వాధీనం చేసుకున్నారు.
కలెక్షన్ కింగ్స్
Published Mon, Dec 30 2013 4:03 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement