‘ఇసుక మాఫియా’కు రాజకీయ అండ | 'Sand mafia' political support to | Sakshi
Sakshi News home page

‘ఇసుక మాఫియా’కు రాజకీయ అండ

Published Fri, Jul 4 2014 3:31 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

‘ఇసుక మాఫియా’కు రాజకీయ అండ - Sakshi

‘ఇసుక మాఫియా’కు రాజకీయ అండ

  • నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
  •  పరిషత్‌లో సిద్ధరామయ్య
  • సాక్షి, బెంగళూరు : ఇసుక అక్రమ రవాణా వెనుక కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీ నాయకుల పాత్ర ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండలిలో గురువారం పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ భానప్రకాశ్, విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా ఇసుక సేకరణ, రవాణా, క్రయవిక్రయాలను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు.

    కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ‘ఇసుక మాఫియా’ పై గట్టి నిఘా ఉంచిందన్నారు. అందులో భాగంగా మొబైల్ స్క్వాడ్, ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నూతన ఇసుక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ వందల కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయలను అపరాద రుసుంగా వసూలు చేశామని వివరించారు.

    అయితే ఇసుక మాఫియా వెనక ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రాజకీయ నాయకుల పాత్ర ఉందన్నారు. అలాగని ఆరోపణలు వచ్చినవారందరూ తప్పు చేసినట్లు కాదన్నారు. తన కుమారుడి పైనా అక్రమ ఇసుక తరలింపు విషయమై ఆరోపణలు వచ్చాయన్నారు. ఇలాంటి వెనుక మాఫియా హస్తం ఉంటుందని తెలిపారు. ఒక్కొక్కసారి ప్రభుత్వ ఉన్నతాధికారులూ అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారన్నారు. అందువల్లే ఈ సమస్యను పూర్తిగా అరికట్టలేక పోతున్నామని సిద్ధరామయ్య తెలిపారు. అయితే ఇక ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
     
    ప్రత్యేక కమిటీ వేశాం
     
    మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న హత్యాచారాలను నియంత్రించడానికి అనుసరించాల్సిన విధివిధానాల పట్ల ప్రత్యేక కమిటీ వేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిషత్‌లో తెలిపారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ఎమ్మెల్సీ మోటమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో మహిళలలు, పిల్లలపై దౌర్జన్యాలు పెరుగుతున్న మాట వాస్తవమన్నారు. దేశం మొత్తంలో ఈ సమస్య ఉందన్నారు. తమ ప్రభుత్వం ఈ సమస్యకు తక్షణ, శాశ్వత పరిష్కారం అలోచిస్తోందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసిందని, నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడుతామన్నారు.
     
    ఐదునెలల్లో శాశ్వత పరిష్కారం...
     
    దాదాపు ఐదు నెలల్లో బెంగళూరును పట్టి పీడుస్తున్న చెత్తకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిషత్‌లో విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తారా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... నగరంలో ప్రతి రోజు నాలుగువేల టన్నుల చెత్త పోగవుతోందన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు రీ సైక్లింగ్ చేయక పోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నవుతున్నాయన్నారు. 2006 నుంచి నగరంలో ఈ సమస్య ఉందన్నారు. సమస్య పరిష్కారంలో భాగంగా బెంగళూరు శివారులో నాలుగు చెత్త రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇక మండూరు చెత్త సమస్యకు పరిష్కారం కనుగొనడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి దర్పణ్‌జైన్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏది ఏమైనా మరో ఐదు నెలల్లోపు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం తెలిపారు.
     
    ఇంకా పరిశీలన దశలోనే...
     
    ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందన పాడి రైతులకు అదనంగా రూ.2 ప్రోత్సాహక ధనం ఇవ్వాలనే విషయం ఇంకా పరిశీలన దశలోనే ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర పరిషత్‌కు తెలిపారు. ఎమ్మెల్సీ మరితిబ్బేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో అదనంగా రూ.144 కోట్లు కేటాయించిందన్నారు. అందువల్లే ఆయా వర్గాల పాడి రైతులకు అదనంగా ప్రోత్సాహకధనం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. దీని వల్ల 65 వేల మంది ఎస్సీ, 40 వేల మంది ఎస్టీ పాడిరైతులకు ప్రయోజం కలుగుతుందన్నారు. ప్రభుత్వం పాడి రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందనడం తగదన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని టీ.బీ జయచంద్ర పరిషత్‌కు తెలిపారు. ఏ విషయమైన ఈ వారంలో జరగనున్న ఉన్నత స్థాయి కమిటీలో చర్చించే ఈ రెండు వర్గాల పాడిరైతులకు అదనపు ప్రోత్సాహకం ఇచ్చే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామని ఆయన వివరించారు.
     
    బెంగళూరులో బంగ్లాదేశీయులు
     
    బెంగళూరు నగరంలో 97 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎమ్మెల్సీ అరుణా శహపుర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...  అక్రమంగా నివశిస్తున్న వారిని బంగ్లాదేశ్ చేర్చేంత వరకూ వారి సంక్షేమం, భద్రత ఇక్కడి ప్రభుత్వంపై ఉంటుందన్నారు.  అందువల్ల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమశాఖకు సూచించామన్నారు. అక్రమంగా నివశిస్తున్న వారందరిని ఒకే చోట ఉంచడం వల్ల విదేశీ శక్తుల వల్ల ఎదురవుతున్న శాంతి భద్రతల సమస్యలను సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చునని కే.జే జార్జ్ తెలిపారు.
     
    మీ వల్లే పరమేశ్వర్‌ను మండలికి పంపించాం...
     
    శాసనమండలిలో మిమ్మలను నియంత్రించడానికే పరమేశ్వర్‌ను శాసనమండలి సభ్యులుగా చేయాల్సి వచ్చిందని పరిషత్‌లో సీఎం సిద్ధారమయ్య విపక్ష నాయకుడు ఈశ్వరప్పతో సరదాగా పేర్కొన్నారు. మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పరమేశ్వర్... ఈశ్వరప్పకు షేక్‌హాండ్ ఇస్తుండగా బీజేపీ ఈశ్వరప్పను మండలికి తీసుకు వచ్చిన తర్వాతనే తాము పరమేశ్వర్‌ను పరిషత్ సభ్యుడిగా ఎంపిక చేశాం.’ అని అన్నారు. ఇందుకు ఈశ్వరప్ప ప్రతి స్పందిస్తూ... మా పార్టీ న న్ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసింది. మీరు కూడా పరమేశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పిస్తారా?’ అని ప్రశ్నించారు. సిద్ధు ప్రతిస్పందిస్తూ... ‘మీకు ఒక్కరికే కాదు. ఆర్.అశోక్‌కు కూడా ఆ పదవి దక్కింది కదా?’ అన్నారు. ‘దాందేముంది ఎమ్మెల్సీ ఉగ్రప్పకు కూడా డీసీఎం పదవి ఇవ్వండి అని సూచించారు. ఉగ్రప్ప మాట్లాడుతూ... విపక్ష నాయకుడికి మాపై ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. ఇంతలో సభాపతి శంకరమూర్తి కలుగజేసుకోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement