నగరి: చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. తడుకుపేట చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వసూళ్లకు పాల్పడున్నట్లు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న ఏసీబీ అధికారులు వారి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.