కడప అర్బన్/సిద్దవటం, న్యూస్‌లైన్ : పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున భాకరాపేట చెక్‌పోస్టు వద్ద లారీలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా సిబ్బందితో వెంటపడి పట్టుకున్నారు. రేణిగుంటకు చెందిన ఏపీ03 ఎక్స్ 4763 నెంబరుగల వాహనంలో వందకు పైగా ఎర్రచందనం దుంగలను కడప వైపు తీసుకొచ్చారు. ఎర్రచందనం దుంగలపై టార్ఫలిన్ పట్టలను కప్పుకుని కడప వైపు బయలుదేరారు.
పూజలు నిర్వహించిన వాహ నం కావడంతో ఎవరికీ అనుమానం కలగదని స్మగ్లర్లు భావించారు. సదరు వాహనంలో కడప వైపు తీసుకు వస్తుండగా భాకరాపేట చెక్‌పోస్టు వచ్చేసరికి అప్పటికే కడప డీఎఫ్‌ఓ శివానీడోగ్రా, సబ్ డీఎఫ్‌ఓ గురు ప్రభాకర్‌లకు అందిన పక్కా సమాచారం మేరకు నిఘా ఉంచారు. వాహనాన్ని తనిఖీ చేసేందుకు అటవీ సిబ్బంది ఆపుతుండగా వేగంగా దూసుకెళ్లింది. దీంతో అటవీశాఖ అధికారులు తమ వాహనాలతో వెంబడించి కిలోమీటరు దూరంలోనే లారీని పట్టుకున్నారు. వాహనాన్ని నడుపుతున్న రేణిగుంటకు చెందిన బాబ్జి అనే డ్రైవర్ పట్టుబడ్డాడు. మరో వ్యక్తి పరారయ్యా డు. ఈ సంఘటనలో రేంజ్ ఆఫీసర్ బాల నర్సయ్య, ఎఫ్‌ఎస్‌ఓ క ృష్ణమూర్తినాయక్, ఏబీఓ రామచంద్రారెడ్డి, ఎఫ్‌బీఓ వెంకట రమణ, సిబ్బందితో పాల్గొని వాహనాన్ని పట్టుకున్నారు.
ఈ సందర్బంగా కడప డీఎఫ్‌ఓ శివానిడోగ్రా విలేకరులతో మాట్లాడుతూ పక్కా సమాచారంతో వాహనంతోసహా ఎర్రచందనాన్ని పట్టుకున్నామన్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు. ఎర్రచందనం విలువ దాదాపు రూ.5నుంచిరూ.7లక్షలు ఉంటుందని అంచనా వేయగలిగామన్నారు. వీటి బరువు సుమారు 3 టన్నులు ఉంటుందన్నారు. లారీ విలువ రూ.3 లక్షలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఆమె కోరారు.
భారీగా ఎర్రచందనం పట్టివేత
Published Sat, Oct 19 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement