
గుడారం వద్ద భోజనం చేస్తున్న పోలీసులు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని నర్సింగాపూర్ గ్రామ పరిసరాల్లో కరీంనగర్– సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎండలో.. వానలో వాహనాల రాకపోకలు నియంత్రిస్తూ ఇంట్లో ఉండాలని ప్రజలకు చెబుతున్నారు. ఏదో ఓ వంకతో వాహనాలపై వస్తున్న వారిని బయటకు రావద్దని వేడకుంటున్నారు. పొద్దంతా విపరీతంగా ఎండ దంచుతోంది.. అదే ఒక్కసారిగా సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కరుస్తోంది. రోడ్డు పక్కకు చిన్న గుడారం వేసుకుంటే అది మూడు రోజుల క్రితం ఈదురు గాలులకు లేచిపోగా మళ్లీ వేసుకున్నారు. అక్కడే భోజనం..అక్కడే నిద్ర ఇలా ప్రజల కోసం కష్ట పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment