భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ దాడులు | ACB raids on bhoraj check post | Sakshi
Sakshi News home page

భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ దాడులు

Published Mon, Dec 30 2013 6:07 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids on bhoraj check post

జైనథ్, న్యూస్‌లైన్ : జైనథ్ మండలం భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు కరీంనగర్ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో కమర్షియల్ ట్యాక్సెస్, రవాణ, ఎక్సైజ్, ఫారెస్ట్, సివిల్ సప్లై శాఖల్లో సుమారు ఆరుగంటలపాటు సోదాలు చేశారు.
 
 సోదాలు నిర్వహించిన అనంతరం డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ..  కాగ ఏసిబి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగానే ఇక్కడ కూడ దాడులనిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు ఆరు గంటలపాటు జరిపిన సోదాల్లో రూ.61 వేలు అధికంగా ఉండటంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సోదాల్లో తేల్చిన పూర్తి వివరాలతో కూడిన నివేదికల ప్రతులను సంబంధిత శాఖల ఉన్నతస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి సీఐ రమణమూర్తి, సీఐ శ్రీనివాస్ రాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement