‘కట్టలు’ తెగుతున్న కరెన్సీ!
చండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెద్దమొత్తంలో డబ్బు పట్టుకున్నారు. మర్రి గూడ మండలం లెంకలపల్లికి చెందిన అబ్బరబోయిన వెంకటేశం (వెంకన్న) శుక్రవారం ఉదయం తన సొంతకారులో చం డూరుకు వెళ్తుండగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బంగారిగడ్డ చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు.
కారులో * 3.60లక్షల నగదు తీసుకెళ్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే విచారణ చేసి పరిశీలి స్తామని సీఐ సుబ్బరాంరెడ్డి తెలిపారు. *50 వేలకు మించి నగదు తీసుకెళ్తే ఆధారాలు చూపిం చాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్‌ఐ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరిలో.. రూ.11.38లక్షలు
తిరుమలగరి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి * 11.38లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా జనగాం నుంచి వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. ఈ డబ్బును ఎన్నికల రిట ర్నింగ్ అధికారి పేర బ్యాంకులో డిపాజిట్ చేశామన్నారు. జనగాం సాయి శ్రీనివాస్ జి న్నింగ్ మిల్లు నిర్వాహకులు రైతులకు చెల్లిం చడానికి డబ్బులు తీసుకెళ్తున్నట్లు తెలిపా రు. తనిఖీల్లో వెంకన్న, జానిమియా, రమే ష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.