Canduru
-
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
చండూరు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత అన్నారు. సోమవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హా మీలు అమలు చేయకుండా నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇంటికో ఉద్యోగం.. దళితులకు మూడు ఎకరాలు అంటూ దగాచేశారని మం డిపడ్డారు. కనీసం రైతాంగ సమస్యలు కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పున్న ధర్మేందర్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్, ఎండీజున్ను, దేవా, నాగారాజు, రోహిత్ పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి
చండూరు : గట్టుప్పల మండలం రద్దుపై అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలని రైతుసేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గట్టుప్పలలో జరిగిన ఒక్క రోజు దీక్షకు ఆయన ఆదివారం సంఘీభావం తెల్పిన అనంతరం మాట్లాడారు. చండూరుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న గట్టుప్పల గ్రామానికి మండలానికి కావల్సిన అర్హత ఉందన్నారు. ఆ ఇద్దరి గలాటలో మండలాన్ని కోల్పోయామని ఆరోపించారు. వారు గ్రామస్తులకు తమ సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉందన్నారు. తప్పించుకొని ఎన్నాళ్లు తిరుగుతారని, ఎన్నికల ముందైన తమ దగ్గరకు వస్తారని, ఆ సమయంలో తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు. గట్టుప్పల మండలం కోసం చేస్తున్న దీక్షలకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. మండలం ఏర్పాటయ్యే వరకు నిరసనలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం, క్రిష్ణయ్య, రాపోలు సత్తయ్య, పోరెడ్డి ముత్తారెడ్డి, లడే సత్తయ్య, గుండుకాడి జంగయ్య, కుమ్మరి సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగొని మల్లేశం తదితరులు ఉన్నారు. ఆందోళనలు ఆగవు : ఇడెం కైలాసం చండూరు : గట్టుప్పలను మండలంగా ప్రకటించే వరకు ఆందోళనలు ఆగవని మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం అన్నారు. 82వ రోజు మండల సాధన కమిటీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. 82 రోజులుగా దీక్షలు చేపడుతున్న అధికార పార్టీ నేతలు స్పందించక పోవడం బాధకరమన్నారు. అసెంబ్లీలో మండలం పై ఎమ్మెల్యే చర్చించపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎన్ని నెలలైన, సంవత్సరాలైన నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో రాపోలు సత్తయ్య, లడే సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగోని మల్లేశం తదితరులు ఉన్నారు. -
సోనిది హత్యే
► క్షణికావేశంలోనే తండ్రి ఘాతుకం ► పోలీసుల విచారణలో వెల్లడి ►నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెందిన సోనిది ఆత్మహత్య కాదని, హత్యేనని తేలింది. క్షణికావేశంలో తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం నల్లగొండ డీఎస్పీ సుధాకర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గట్టుప్పలకు చెందిన బొడిగే కృష్ణకు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గ్రామంలోనే మగ్గం నేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పెద్ద కుమార్తె స్వప్నకు వివాహం చేశాడు. రెండో కుమార్తె మానస, చిన్న కుమార్తె సోని(19) ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇటీవల కృష్ణ మద్యానికి బానిసగా మారి తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. కుమారుడు బైక్ తీసుకెళ్లాడని.. గట్టుప్పలను మండలం చేయాలని గ్రామంలో కొద్ది రోజులుగా ఆందోళనలు సాగుతున్నారుు. ఈ నెల 14న గ్రామంలో జరుగుతున్న దీక్ష వద్దకు కృష్ణ తన భార్యతో కలసి వెళ్లాడు. కాసేపటికి కృష్ణ ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. తన బైక్ కనిపించకపోవడంతో ఎవరు తీసుకెళ్లారంటూ కూతుళ్లను అడిగాడు. తమ్ముడు గణేశ్ తీసుకెళ్లాడని చెప్పడంతో వాడికి తాళం చేతులు ఎవరు ఇచ్చారంటూ ఆగ్రహానికి లోనై వాగ్వాదానికి దిగాడు. దీంతో రెండో కుమార్తె మానస ఏడ్చుకుంటూ పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. చిన్న కూతురు సోని మాత్రం తమ్ముడే కదా తీసుకెళ్లింది.. అంటూ తండ్రితో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కృష్ణ.. కూతురు అనే కనికరం లేకుండా ఆమె తలను పట్టుకుని తలుపునకు బాదడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించి.. క్షణికావేశంలో కూతురిని హత్య చేసిన కృష్ణ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పథకం రచించాడు. కూతురు మృతదేహాన్ని స్నానాల గదిలో వేసి కిరోసిన్ పోసి నిప్పంటించి అక్క డి నుంచి వెళ్లిపోయాడు. దారిలో భార్య కనిపించడంతో కూతురు ఒక్కతే ఉంది.. ఇంటికి వెళ్లమని పురమాయించాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకుని కూతురు మంటల్లో కాలిపోతుండడాన్ని గమనించి కేకలు వేయగా, ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కృష్ణ తన కూతురు మండలం కోసం ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా.. తలకు బలమైన గాయం కావడంతో సోని చనిపోరుుందని, అనంతరమే కిరోసిన్ పోసి నిప్పంటించారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ వివరించారు. -
‘కట్టలు’ తెగుతున్న కరెన్సీ!
చండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెద్దమొత్తంలో డబ్బు పట్టుకున్నారు. మర్రి గూడ మండలం లెంకలపల్లికి చెందిన అబ్బరబోయిన వెంకటేశం (వెంకన్న) శుక్రవారం ఉదయం తన సొంతకారులో చం డూరుకు వెళ్తుండగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బంగారిగడ్డ చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు. కారులో * 3.60లక్షల నగదు తీసుకెళ్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే విచారణ చేసి పరిశీలి స్తామని సీఐ సుబ్బరాంరెడ్డి తెలిపారు. *50 వేలకు మించి నగదు తీసుకెళ్తే ఆధారాలు చూపిం చాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఐ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరిలో.. రూ.11.38లక్షలు తిరుమలగరి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి * 11.38లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా జనగాం నుంచి వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఈ డబ్బును ఎన్నికల రిట ర్నింగ్ అధికారి పేర బ్యాంకులో డిపాజిట్ చేశామన్నారు. జనగాం సాయి శ్రీనివాస్ జి న్నింగ్ మిల్లు నిర్వాహకులు రైతులకు చెల్లిం చడానికి డబ్బులు తీసుకెళ్తున్నట్లు తెలిపా రు. తనిఖీల్లో వెంకన్న, జానిమియా, రమే ష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.