చండూరు : గట్టుప్పల మండలం రద్దుపై అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలని రైతుసేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గట్టుప్పలలో జరిగిన ఒక్క రోజు దీక్షకు ఆయన ఆదివారం సంఘీభావం తెల్పిన అనంతరం మాట్లాడారు. చండూరుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న గట్టుప్పల గ్రామానికి మండలానికి కావల్సిన అర్హత ఉందన్నారు. ఆ ఇద్దరి గలాటలో మండలాన్ని కోల్పోయామని ఆరోపించారు. వారు గ్రామస్తులకు తమ సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉందన్నారు. తప్పించుకొని ఎన్నాళ్లు తిరుగుతారని, ఎన్నికల ముందైన తమ దగ్గరకు వస్తారని, ఆ సమయంలో తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు. గట్టుప్పల మండలం కోసం చేస్తున్న దీక్షలకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. మండలం ఏర్పాటయ్యే వరకు నిరసనలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం, క్రిష్ణయ్య, రాపోలు సత్తయ్య, పోరెడ్డి ముత్తారెడ్డి, లడే సత్తయ్య, గుండుకాడి జంగయ్య, కుమ్మరి సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగొని మల్లేశం తదితరులు ఉన్నారు.
ఆందోళనలు ఆగవు : ఇడెం కైలాసం
చండూరు : గట్టుప్పలను మండలంగా ప్రకటించే వరకు ఆందోళనలు ఆగవని మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం అన్నారు. 82వ రోజు మండల సాధన కమిటీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. 82 రోజులుగా దీక్షలు చేపడుతున్న అధికార పార్టీ నేతలు స్పందించక పోవడం బాధకరమన్నారు. అసెంబ్లీలో మండలం పై ఎమ్మెల్యే చర్చించపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎన్ని నెలలైన, సంవత్సరాలైన నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో రాపోలు సత్తయ్య, లడే సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగోని మల్లేశం తదితరులు ఉన్నారు.
అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి
Published Mon, Jan 2 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
Advertisement