సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలు క్షేత్రస్థాయిలో నువ్వానేనా అనే విధంగా పోటాపోటీ నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రత్యక్ష పోరాటాలు, ఘర్షణలు సైతం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీడి యా ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీల శ్రేణులు, కార్యకర్తలు ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడా ది ఎన్నికలు జరుగనుండడంతో క్షేత్రస్థాయి పోరు లో సరికొత్తగా ఫ్లెక్సీల యుద్ధానికి దిగుతున్నారు.
తెల్లారేపాటికి పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్లెక్సీల వార్ రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు నెలల కిందట పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ గురించి బీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు. దీంతో బీజేపీ శ్రేణులు జిల్లాలోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ తాజాగా ఈ ఫ్లెక్సీల వార్ స్పీడందుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని నందిపేట మండలం తల్వేద గ్రామం, మోపాల్ మండలం బాడ్సి గ్రామంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తల్వేదలో వేసిన ఫ్లెక్సీలో హామీలు మరిచిన ఎమ్మెల్యే తమ గ్రామానికి ఎందుకొస్తున్నావంటూ రాశారు. దీంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పో లీసు బందోబస్తుతో గ్రామంలో పర్యటించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఒక మహిళ జీవన్‌రెడ్డిని నిలదీసింది. పలు సమస్యలపై గ్రామ స్తులు నిలదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ను పోలీసులు డిలీట్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక బాడ్సిలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామ పర్యటన రద్దయ్యింది.
● మీడియా, సోషల్ మీడియా స్థాయి పోరు ఇప్పు డు ఫ్లెక్సీల వరకు రావడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల అంశాలు సైతం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుండడంతో ఈ రకమైన సంస్కృతికి పలువురు ఉత్సాహం చూపిస్తుండడం విశేషం. రానున్న రోజుల్లో ఈ ఫ్లెక్సీల పోరుకు అన్ని పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment