బుర్రా మధుసూదన్ యాదవ్, ఉగ్ర నరసింహారెడ్డి
సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిలు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 10 మంది వరకు పోటీలో ఉన్నారు.
మనసున్న నేత
♦ బుర్రా మధుసూదన్ యాదవ్‌కు తొలి నుంచి సౌమ్యుడిగా పేరుంది.
♦ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించేతత్వం ఆయన సొంతం.
♦ భోళా శంకరుడు. కల్మషం లేని వ్యక్తి
♦ ఐదేళ్ల నుంచి కనిగిరిలో ఉంటూ అందరి మనిషిగా పేరొందారు.
♦ పేద, ధనిక తేడా లేదు. గర్వం అనేది ఉండదు.
♦ అడిగిన వారికి ఎంతో కొంత సాయం చేయాలనే నైజం.
♦ ముందు ఎదుటి వారి మాట పూర్తిగా విన్న తర్వాత చిరునవ్యుతో స్పందిస్తూ అతనికి సమాధానం చెప్పడం బుర్రా గొప్పతనం.
♦ ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టడం బుర్రా నైజం.
♦ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యవుతారు.
♦ దివ్యాంగ, అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూస్తూ మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు.
♦ రాజకీయ జిమ్మిక్కులు తెలియవు
ఉగ్రకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ..
♦ గిట్టని వ్యక్తిపై కక్ష సాధిస్తాడన్న పేరు
♦ మంచితనంగా ఉంటూనే ఇబ్బంది పెడతాడు
♦ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు
♦ మాటల్లో ఆప్యాయత, పలకరింపు తక్కువ
♦ బెదిరింపు ధోరణి ఎక్కువగా కన్పిస్తుంది.
♦ కుల రాజకీయాలు చేస్తాడని పేరు
♦ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం
♦ ఎంతటి వారినైనా సమయానుగుణంగా తనవైపు తిప్పు కోవడం
♦ రాజకీయ రంగులు మరుస్తాడన్న పేరు ఉగ్ర నరసింహారెడ్డికి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment