సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్(ఐఈటీఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఐఆర్‌వో) గుర్తింపుతో 1953లో ఏర్పడిన ఈ సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాలకు చెందిన నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు.
చదవండి: ఆ అగ్రిమెంట్‌లో తప్పేముంది?
ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ తరఫున 1.25 లక్షల మందికి పైగా నిపుణులు దేశ, విదేశాల్లో 63 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మంత్రి డాక్టర్ సురేష్‌ను ఐఈటీఈ సొసైటీ విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరింది. డాక్టర్ సురేష్ కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment