
సాక్షి, ప్రకాశం జిల్లా: దళితులను అవహేళన చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు ఏమీ పీకలేరు అన్న మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పర్యటిస్తారని ఆదిమూలపు నిలదీశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మండిపడ్డ ఆదిమూలపు.. పలు ప్రశ్నలు సంధించారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?.. దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా?
యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా?, ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరీక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా?, అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?, జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి?, నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడితేనే ఒప్పుకోని నీవు... సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. నీది రెండు నాల్కల ధోరణి’ అని ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Comments
Please login to add a commentAdd a comment