Yerragondapalem constituency
-
చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్
సాక్షి, ప్రకాశం: చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. బాబు సభకు జనం రాకపోవడంతనే గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ కంచుకోట.. దమ్ముంటే టీడీపీ గెలవాలని సవాల్ విసిరారు. యర్రగొండపాలెంలో టీడీపీ గెలిస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. చంద్రబాబే దగ్గరుండి తమ కార్యకర్తలపై దాడి చేయించారని మండిపడ్డారు. యర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల అక్రమాలు, గంజాయి ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు. చదవండి: ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ కాగా, అధికారంలో ఉన్న ఐదేళ్లూ వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసిన చంద్రబాబు.. వెలిగొండను తానే పూర్తి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోమారు మోసం చేసేందుకు వెలిగొండ పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అసలు వెలిగొండపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. -
‘దళితులను అవమానించిన మీకు అక్కడ తిరిగే అర్హత ఉందా?’
సాక్షి, ప్రకాశం జిల్లా: దళితులను అవహేళన చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు ఏమీ పీకలేరు అన్న మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పర్యటిస్తారని ఆదిమూలపు నిలదీశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మండిపడ్డ ఆదిమూలపు.. పలు ప్రశ్నలు సంధించారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?.. దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా? యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా?, ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరీక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా?, అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?, జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి?, నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడితేనే ఒప్పుకోని నీవు... సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. నీది రెండు నాల్కల ధోరణి’ అని ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్. -
ఆ అంశాలే ఆదిమూలపు సురేష్‌కు మరో అవకాశం కల్పించాయి..
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): సామాజిక న్యాయంలో భాగంగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి స్థానం దక్కింది. మూడేళ్లుగా విద్యాశాఖామంత్రిగా పనిచేస్తున్న సురేష్.. మూడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యర్రగొండపాలెం (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు (ఎస్సీ) స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. మూడో పర్యాయం 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. రెండోసారి కలిసొచ్చిన అంశాలు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖామంత్రిగా ఆ శాఖలో కొత్త సంస్కరణలు అమలుచేసి పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చారు. రెండో పర్యాయం కూడా ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కడంపై యర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు మార్కాపురంలోని సురేష్ నివాసం వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేశారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సురేష్ ప్రచారం
-
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సురేష్ ప్రచారం
-
జగన్ చెప్పి పంపాడు : వైఎస్ విజయమ్మ
సాక్షి, ప్రకాశం : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ టీడీపీపై విమర్శలు గుప్పించారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధికి ఒక్క అడుగైనా పడిందా అని నిలదీశారు. వెలిగొండ ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేశారని, జిల్లాకు 16 సార్లు వచ్చిన చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ హామీనిచ్చాడని అదే విషయం చెప్పమని నన్ను పంపించాడని అన్నారు. భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘జగన్ కోసం ఇవాళ గడప గడప దాటాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. ఓట్లడగడానికి జగన్ అమ్మ వస్తోంది. ఆయన చెల్లి వస్తోంది అని టీడీపీ నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారు. మీకోసం కష్టపడుతున్న జగన్‌ను ఆశీర్వదించమని అడిగేందుకు వచ్చాను. మీ అమూల్యమైన ఓట్లని ఫ్యాన్ గుర్తుకు వేయండి. వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయండి. 25 మంది ఎంపీ సీట్లను గెలిపించి ప్రత్యేక హోదా సాధించేలా జగన్‌ని ఆశీర్వదించండి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా అధిమూలపు సురేష్‌ని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలిపించండి’ అనివిజయమ్మ పిలుపునిచ్చారు. 72 గంటల్లోనే ప్రజా సేవలు.. మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు అంటున్నారు. ఇన్నాళ్లూ ఏం బాధ్యత తీసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా మీ భద్రత నాది అన్నారు. అక్క చెల్లెళ్లారా.. మీకు భద్రత ఉందా. రైతులకు రుణమాఫీ చేశానని చంద్రబాబు అబధ్ధాలు చెప్తుతున్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ పూర్తి ఆరోగ్య భద్రత కల్పిస్తాం. 108 సేవల్ని బలోపేతం చేస్తాం. ఫీజు రీయంబర్స్మెంట్ జరగకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లులుకి రూ.15000 అందిస్తాం. విద్యార్థులకు వసతి గృహ ఖర్చులకు రూ. 20 వేలు చెల్లిస్తాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. డ్వాక్రా రుణాలు నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాం. 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 72 గంటల్లోపే ప్రజాసేవలన్నీ గ్రామ సచివాలయం ద్వారా అందేలా చూస్తాం. చంద్రబాబు విలువలు లేని వ్యక్తి. ఆయనకు ఓట్లడిగే హక్కు లేదు. విశ్వసనీయత లేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వైఎస్సార్ హయాంలోనే జాతీయ హోదా.. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేసే తత్వం నా భర్తది. వైఎస్ జగన్ రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి. నా బిడ్డ తాపత్రయం ప్రజల సంక్షేమమే. జగన్ ప్రజల పక్షాన నిలబడటం నచ్చని చంద్రబాబు నా బిడ్డను ఎయిర్‌పోర్టులో అంతం చేయాలనుకున్నారు. మన రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లను గెలిపించుకుంటే ప్రత్యేక హోదా అదే వస్తుంది. జగన్ బీజేపీతో కలవలేదు. అవకాశ వాద పొత్తులు, రాజకీయాలు చంద్రబాబు నైజం. -
కరెంటు కోసం కన్నెర్ర
యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఫిబ్రవరి నెలలోనే ఇలా ఉంటే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందోనని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ సమయపాలన లేకపోవడంతో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన ైరె తులు పొలాల్లోనే జాగారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు సమీపిస్తుండగా ఉదయం, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, విద్యుత్ మరమ్మతుల కేంద్రంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. హెచ్‌వీడీఎస్ పథకం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించేంత వరకూ ధర్నా విరమించేది లేదని డేవిడ్‌రాజు పట్టుబట్టారు. దీంతో ధర్నా వద్దకు ఏడీఈ ఎస్.శ్రీనివాసరెడ్డి వచ్చి విద్యుత్ సరఫరాను మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలైందని, దీని వల్లే సమస్య వచ్చిందని వివరించారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఏడీఈ హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఎస్ఈ,డీఈలకు డేవిడ్‌రాజు ఫోన్లో వివరించారు. త్వరలో తాను నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని, మార్చి 15లోపు శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సమస్యను పరిష్కరించి మెరుగైన విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని, పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు అనుకూలంగా ఉదయం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా ఇస్తామని ఎస్ఈ జయకుమార్ హామీ ఇవ్వడంతో డేవిడ్‌రాజు ధర్నా విరమించారు. తొలుత ఎమ్మెస్ రోడ్డులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సెంటర్ నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు కోట వెంకటరెడ్డి, పెద్దపోతు చంద్రమౌళిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ఉమామహేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ ఎన్.జయప్రకాశ్, వైపాలెం యువజన విభాగం కన్వీనర్ కొదమల జిన్న, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గూడా వెంకటరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ డెరైక్టర్ భూమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు గంజి వెంకటేశ్వరరెడ్డి, గుండ్రెడ్డి రామిరెడ్డి, జి.గోవిందరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, పఠాన్ మాబూఖాన్, ఆవుల అచ్చిరెడ్డి, బి. రవణారెడ్డి, ఎస్.పోతిరెడ్డి, సుబ్రహ్మణ్యాచారి, పరిశపోగు యోహాన్, ఎలిసెల కోటేశ్వరరావు, పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.