ఆదిమూలపు సురేష్
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): సామాజిక న్యాయంలో భాగంగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి స్థానం దక్కింది. మూడేళ్లుగా విద్యాశాఖామంత్రిగా పనిచేస్తున్న సురేష్.. మూడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఐఆర్‌ఎస్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు.
2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యర్రగొండపాలెం (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు (ఎస్సీ) స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. మూడో పర్యాయం 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.
రెండోసారి కలిసొచ్చిన అంశాలు
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖామంత్రిగా ఆ శాఖలో కొత్త సంస్కరణలు అమలుచేసి పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చారు. రెండో పర్యాయం కూడా ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కడంపై యర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు మార్కాపురంలోని సురేష్ నివాసం వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేశారు.
చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..)
Comments
Please login to add a commentAdd a comment