
చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘టిడ్కో ఇళ్లపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా.. సెల్ఫీలతో అబద్ధాలను ప్రచారం చేస్తూ.. తండ్రీ కొడుకులు కాలం గడుపుతున్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేశామని చెప్తున్న టీడీపీ నేతలు.. ఎన్ని పూర్తి చేశారో చెప్పగలరా?’ అంటూ మంత్రి ప్రశ్నించారు.
‘‘2.20 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తవుతున్నాయి. డిసెంబర్‌లోగా ప్రజలకు ఇచ్చి ఎన్నికలకు వెళ్తాం. టిడ్కో ఇంటిని రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తూ.. మహిళలకు ఇస్తున్న ఘనత సీఎం జగన్‌ది. ఇవ్వన్నీ పచ్చమీడియాకు కనబడవు.. వినపడవు’’ అని మంత్రి సురేష్ మండిపడ్డారు.
చదవండి: రామోజీరావు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తోడల్లుడు అప్పారావు