
సాక్షి, ప్రకాశం: లోకేష్ కార్ల ముందు సెల్ఫీ దిగి ఎస్సీలను ఉద్ధరించినట్టు పోజులు కొడుతున్నాడని మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు టీడీపీ హయంలో ఇచ్చిన ఇన్నోవాలు నిజంగానే ఎస్సీలకే ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆ కార్ల వ్యవహారం పై చర్చకు వచ్చే దమ్ము లోకేష్‌కు ఉందా అని సవాల్ విసిరారు.
తండ్రి ,కొడుకులు తాజ్ మహల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని .. అది కూడా మేమే కట్టాం అనేలా ఉన్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. ఎస్సీలకు కార్ల పేరుతో మధ్యవర్తిలకు దోచిపెట్టింది వాస్తవం కాదా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నేరుగా పేదవాడికే లబ్ది చేకూరుతోందని, పేదలు వైఎస్సార్‌సీపీకి అండగా వున్నారని అక్కసుతో తండ్రి కొడుకులు సెల్ఫీల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment