సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ వ్యవస్థపై పచ్చపత్రికల్లో అబద్దాలు, అవాస్తవాలు రాస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్యన వాలంటీర్‌లు వారధిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాంటి వ్యవస్థపై రామోజీరావు తన పత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా వాలంటీర్ల ద్వారా అందిస్తున్నాం. కులం, ప్రాంతం, పార్టీ చూడకుండా వాలంటీర్ వ్యవస్థ తెచ్చాము. వాలంటీర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేశాము. ఏ పార్టీ వారైనా అర్హత ఉంటే అవకాశం ఇచ్చాం.
ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, మహిళ రిజర్వేషన్లు అమలు చేశాము. రామోజీరావు ఈ వ్యవస్థ కోసం దేశం ఏమంటుందో తెలుసుకోవాలి. లబ్ధిదారులకు ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. టీడీపీ హయాంలో ఏ పథకమైన లంచం లేకుండా ఇచ్చారా?. జన్మభూమి కమిటీలు ఎలా లంచాలు తిన్నారో ప్రజలకు తెలియదా?. వాలంటీర్ వ్యవస్థను మా పార్టీకి వాడుకోవడం లేదు. మా పార్టీకి గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రభుత్వ యంత్రగాన్ని పార్టీ కోసం వాడుకున్న చరిత్ర చంద్రబాబుదే. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు ఎవ్వరు మరువలేరు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
చదవండి: (ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!)
Comments
Please login to add a commentAdd a comment