సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడని మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు తమవేనని స్పష్టం చేశారు.
‘చంద్రబాబుకి ఇక శాశ్వతంగా అసెంబ్లీ కి రాలేడు.రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మాకు పూర్తి తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాకు బ్బ్రహ్మరథం పట్టారు. ఇక మేము ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. వాళ్ళు చేసే యాత్ర రాజకీయపరమైనది. మేము మొదటి నుంచీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. ఎప్పుడూ మేము వెనుకడుగు వేసేది లేదు. అమరావతి రైతులకు చంద్రబాబు కంటే మేమే ఎక్కువ కౌలుకు ఇచ్చాం. కేవలం 26 గ్రామాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాలా?, రాయలసీమ తాగునీటి సంగతి ఏమిటి...ఉత్తరాంధ్ర అభివృద్ది మాటేంటి..?, అన్ని ప్రాంతాల అభివృద్ధి మాకు ముఖ్యం..అదే న్యాయం’ అని తేల్చిచెప్పారు.
మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
అమరావతి యాత్ర ఎవరికోసం...మా ప్రాంతం అబివృద్దికి అది వ్యతిరేకం. సభలో స్పష్టంగా చర్చిస్తాం...అన్ని ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యం. ఈ రోజు సభలో కీలకమైన అంశాలు చర్చిస్తాం. ఎవరి మీద దండయాత్ర చేయడానికి వాళ్ళు యాత్ర చేస్తున్నారు. మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు ప్రయోజిత ఉద్యమం అది. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం మాకు ఏముంది?, చంద్రబాబు చెప్పగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?, ప్రజలు మాకు ఐదేళ్ల కోసం తీర్పు ఇచ్చారు. మేము ప్రజల కోసం పని చేస్తాం’ అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment