andhra pradesh legislative counci
-
‘చంద్రబాబు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడు’
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడని మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు తమవేనని స్పష్టం చేశారు. ‘చంద్రబాబుకి ఇక శాశ్వతంగా అసెంబ్లీ కి రాలేడు.రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మాకు పూర్తి తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాకు బ్బ్రహ్మరథం పట్టారు. ఇక మేము ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. వాళ్ళు చేసే యాత్ర రాజకీయపరమైనది. మేము మొదటి నుంచీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. ఎప్పుడూ మేము వెనుకడుగు వేసేది లేదు. అమరావతి రైతులకు చంద్రబాబు కంటే మేమే ఎక్కువ కౌలుకు ఇచ్చాం. కేవలం 26 గ్రామాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాలా?, రాయలసీమ తాగునీటి సంగతి ఏమిటి...ఉత్తరాంధ్ర అభివృద్ది మాటేంటి..?, అన్ని ప్రాంతాల అభివృద్ధి మాకు ముఖ్యం..అదే న్యాయం’ అని తేల్చిచెప్పారు. మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం అమరావతి యాత్ర ఎవరికోసం...మా ప్రాంతం అబివృద్దికి అది వ్యతిరేకం. సభలో స్పష్టంగా చర్చిస్తాం...అన్ని ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యం. ఈ రోజు సభలో కీలకమైన అంశాలు చర్చిస్తాం. ఎవరి మీద దండయాత్ర చేయడానికి వాళ్ళు యాత్ర చేస్తున్నారు. మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు ప్రయోజిత ఉద్యమం అది. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం మాకు ఏముంది?, చంద్రబాబు చెప్పగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?, ప్రజలు మాకు ఐదేళ్ల కోసం తీర్పు ఇచ్చారు. మేము ప్రజల కోసం పని చేస్తాం’ అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
సీఎం జగన్ అప్యాయంగా పలకరించారు: మండలి చైర్మన్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఈ నెలతో మండలి చైర్మన్ షరీఫ్ పదవీకాలం ముగియనుండటంతో.. సమావేశాల అనంతరం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. తన పదవి ముగుస్తోందని, సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నారు. తనకు ఈ పదవి ఎవరో ఇచ్చారని అనుకోవడం లేదని, రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఒక దశలో రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నానని, కానీ పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ‘అందరూ నాకు సహనం ఎక్కువ అంటున్నారు. కానీ నాకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సహనం ఎక్కువ. బిల్లు ఘటన జరిగిన 3 రోజులకు ఓ కార్యక్రమంలో సీఎంను కలిశా. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా హై టీ కార్యక్రమంలో కలిశా. సీఎం జగన్ చాలా అప్యాయంగా షరీఫ్ అన్న అని పలకరించారు. ఎందుకు కలత చెందారని స్వయంగా అడిగారు. గతంలో ఏ పెద్ద పదవులు చేయలేదు, నేరుగా ఛైర్మన్ అయ్యానని చెప్పాను. మండలిలో కీలక నిర్ణయాల దృష్ట్యా కలత చెందానని సీఎంకు చెప్పా. నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’ అని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం’ AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. -
మండలి ముందుకు కీలక బిల్లులు
సాక్షి, అమరావతి : మరి కొద్దిసేపట్లో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మండలిలో అవలంభించాల్సిన వ్యూహం గురించి వారితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదు. గతంలోనే రూల్ ప్రకారం జరగలేదని చైర్మన్ చెప్పారు. కేవలం విచక్షణ అధికారం ఉందనే సెలెక్ట్ కమిటీ పంపిస్తానని చెప్పారు. సభ అభిప్రాయం తీసుకోకుండానే వాయిదా వేసి వెళ్లిపోయారు. యనమల ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చి చెబుతున్నారు. ఆయన చెప్పిందే రూల్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. యనమల వాదనలకు తలా తోక ఉండదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ పెట్టి రిజెక్టు చేసినా నెలలో బిల్లులు పాస్ అయిపోతాయ’ని అన్నారు. చదవండి : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
'టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు'
సాక్షి,విజయవాడ : శాసన మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమని బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు గురువారం విజయవాడలో పేర్కొన్నారు. శాసన మండలిలో నిష్ణాతులైన వ్యక్తుల్ని ఎన్నుకుంటారని.. కానీ టీడీపీ సభ్యులు ఒక వీధి రౌడీల్లా వ్యవహరించారని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా నడుచుకోవడం దారుణమని పేర్కొన్నారు. బాబు గ్యాలరీలో కూర్చుని టీడీపీ సభ్యుల చేత స్పీకర్‌ను ప్రభావితం చేయించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని తెలిపారు. కృత్రిమ ఉద్యమం ద్వారా బలహీన పడే పరిస్థితి చంద్రబాబుకు వస్తుందని, రాష్ట్రంలో ఉన్న 23స్థానాలను కూడా పోగొట్టుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారు చేస్తున్న ఉద్యమం ద్వారా తాత్కాలికంగా ఆటంకాలు సృష్టించగలిగారే తప్ప ప్రజాస్వామ్యమైన విధానాలను ఆటంకపరచలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుందని బుద్దా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
ఎల్లుండి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: అసెంబ్లీ ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల పదో తేదీ నుంచి ఆరంభకానున్నాయి. ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి రాం నారాయణ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం అయిన అనంతరం 10.30 గం.లకు ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెన్ ను అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు. అయితే మంగళవారం మాత్రం అసెంబ్లీకి సెలవు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి ఆనం భేటీ అయ్యారు. ఈ సమావేశాలను నాలుగు రోజులపాటుజరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం కొందరు మంత్రులతో చర్చించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ తరువాతి పరిణామాలను అనుసరించి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నారు.