
సాక్షి,విజయవాడ : శాసన మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమని బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు గురువారం విజయవాడలో పేర్కొన్నారు. శాసన మండలిలో నిష్ణాతులైన వ్యక్తుల్ని ఎన్నుకుంటారని.. కానీ టీడీపీ సభ్యులు ఒక వీధి రౌడీల్లా వ్యవహరించారని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా నడుచుకోవడం దారుణమని పేర్కొన్నారు. బాబు గ్యాలరీలో కూర్చుని టీడీపీ సభ్యుల చేత స్పీకర్‌ను ప్రభావితం చేయించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని తెలిపారు. కృత్రిమ ఉద్యమం ద్వారా బలహీన పడే పరిస్థితి చంద్రబాబుకు వస్తుందని, రాష్ట్రంలో ఉన్న 23స్థానాలను కూడా పోగొట్టుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారు చేస్తున్న ఉద్యమం ద్వారా తాత్కాలికంగా ఆటంకాలు సృష్టించగలిగారే తప్ప ప్రజాస్వామ్యమైన విధానాలను ఆటంకపరచలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుందని బుద్దా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment