విశాఖ: విశాఖ నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి విడడల రజినీ స్పష్టం చేశారు. కేవలం జీ20 సదస్సు కోసం కాకుండా విశాఖ శాశ్వత అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి రజినీ. సీఎం జగన్ హయాంలో విశాఖ విశ్వఖ్యాతి గడిస్తోందని తెలిపారు. ఈ 28వ తేదీన జీ20 సదస్సుకు సీఎం జగన్ హాజరవుతారని మంత్రి రజినీ పేర్కొన్నారు.
మంత్రి సురేష్ మాట్లాడుతూ.. విశాఖలో జీ20 సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. ‘రూ. 130 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 600 కి.మీ మేర కొత్త రోడ్లు, మరమ్మత్తు పనులు. పరిపాలన రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులు జరిగాయి.రాబోయే రోజుల్లో విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది.కొత్తగా 5 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment