సాక్షి, గుంటూరు: ఏపీలో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై నిందలు వేయడానికి టీడీపీ ప్రయతిస్తోందన్నారు.
విద్యారంగాన్ని మార్చేస్తామని కూటమి చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసేయాలని భావిస్తోంది. నాడు-నేడు ద్వారా సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. అన్ని స్కూళ్లలో మేనేజ్‌మెంట్ కమిటీలు వేశాం. జాతీయ విద్యా విధానానికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా?. జగన్‌పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోంది’’ అని ఆదిమూలపు ధ్వజమెత్తారు.
‘‘జాతీయ విద్యారంగంలో మేము ఎన్నో సంస్కరణలను తెచ్చాం. అవి అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. ఇది పేద విద్యార్థులకు అపార నష్టం తెస్తోంది. గత ఐదేళ్లలో మేము విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు పెట్టాం. నాడు-నేడు కింద వేలాది స్కూళ్లని బాగు చేశాం. జాతీయ విద్యావిధానంలో భాగంగా NEP 2020ని అమలు చేశాం. అసలు చంద్రబాబు ప్రభుత్వం జాతీయ విద్యావిధానానికి అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలి’’ అంటూ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
‘‘జగన్ తెచ్చిన పథకాలపై వ్యతిరేకంగా ముందుగా ఎల్లోమీడియాలో రాయిస్తారు. తర్వాత ఆ పథకాలన్ని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారు. తల్లికివందనం అమలు చేయకుండా మోసం చేశారు. దీనిపై ఎల్లోమీడియా ఎందుకు వార్తలు రాయటం లేదు?’’ అని ఆదిమూలపు ప్రశ్నించారు.
‘‘జగన్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను కేంద్రమే మెచ్చుకుంది. పీపీపీని విద్యారంగానికి పులమొద్దు. పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయవద్దు’’ అని ఆదిమూలపు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment