మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం  | AP Minister Adimulapu Suresh Escape From Accident | Sakshi
Sakshi News home page

మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం 

Published Sun, Dec 4 2022 8:15 AM | Last Updated on Sun, Dec 4 2022 3:53 PM

AP Minister Adimulapu Suresh Escape From Accident - Sakshi

సాక్షి, ప్రకాశం(యర్రగొండపాలెం): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సచివాలయం–2 పరిధిలో శనివారం వీల్‌చైర్‌లో లబ్ధిదారుల గృహాలకు వెళ్లి మాట్లాడారు. కార్యక్రమం పూర్తిచేసుకున్న ఆయన.. ఆ వీధిలో ఉన్న ఒక నాయకుడి ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నారు.

ఆ కుర్చీ బలహీనంగా ఉండటంతో ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. మంత్రి కిందపడే సమయంలో పక్కనే ఉన్న కొంత మంది నాయకులు పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మంత్రి ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో.. ఈ సంఘటన జరగడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కుర్చీ నుంచి వరగడం వలన తనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని మంత్రి తెలిపారు.   

చదవండి: (నేను విఫలమైన రాజకీయ నాయకుడిని.. పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement