సాక్షి, తాడేపల్లి: గత చంద్రబాబు పాలనకు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకూ ఉన్న తేడాను ప్రజలు గమనించారని, అందుకే ప్రజలంతా మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏడు లక్షల మంది సైన్యం అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వెళ్లగా.. వారంతా ఎంతో అభిమానంతో మెగా సర్వేకు సహకరిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా.. సీఎంకు మద్దతు తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు.
ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకమని, ఇదొక చారిత్రాత్మక ప్రజామద్దతుగా పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో పెట్టడంతో పాటు అవన్నీ పరిష్కరిస్తున్నారని కొనియాడారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గణాంకాలతో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నామన్నారు. మాకు ఓటు వేయని వారికి కూడా సాయం చేశామని, అందరికీ మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. టీడీపీ కోటలు బద్దలు అవుతున్నాయి.. ఏడు లక్షల మంది సైనికులు చేస్తున్న సర్వేలో అదే తేలుతోందని స్పష్టం చేశారు. కరోనా వలన ఆర్ధిక సమస్యలు వచ్చినా ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని.. సీఎం జగన్ సువర్ష పాలనలోనే ఇది సాధ్యం అయిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment