సమ్మె విరమిస్తేనే చర్చలు  | Ministers Instruction to Urban Sanitation Workers JAC | Sakshi
Sakshi News home page

సమ్మె విరమిస్తేనే చర్చలు 

Published Wed, Jul 13 2022 4:48 AM | Last Updated on Wed, Jul 13 2022 4:48 AM

Ministers Instruction to Urban Sanitation Workers JAC - Sakshi

సాక్షి, అమరావతి:  పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించి, విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ మేరకు పారిశుధ్య కార్మిక ఐక్య కార్యాచరణ సమితికి (జేఏసీ) సమాచారం ఇచ్చినట్లు మంగళవారం ఆయన చెప్పారు. మంత్రుల ముందుంచిన డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా మిగిలిన అన్నింటినీ పరిష్కరిస్తామని సోమవారం మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కార్మిక జేఏసీకి చెప్పినప్పటికీ కార్మికులు సమ్మెకే మొగ్గు చూపారని, దీంతో పట్టణ పారిశుధ్య నిర్వహణ, ఇతర విధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరైతేనే వారితో చర్చిస్తామని ఆయన ప్రకటించారు. సచివాలయంలో సోమవారం రాత్రి జరిగిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో మంత్రులు సురేష్, బొత్స సత్యనారాయణ మున్సిపల్‌ కార్మిక జేఏసీతో చర్చించారు. ఇందులో కార్మికులు వెల్లడించిన మొత్తం 23 డిమాండ్లలో ఓహెచ్‌ఏ మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఓహెచ్‌ఏను గతంలో మాదిరిగా రూ.6 వేలు చెల్లించాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబట్టారు.

గత ప్రభుత్వంలో పట్టణ పారిశుధ్య విభాగంలోని ఒప్పంద కార్మికుల వేతనం రూ.12 వేలుగా ఉండేదని, వేతనాలు తక్కువగా ఉన్నందున వారికి అదనంగా ఓహెచ్‌ఏ రూపంలో రూ.6 వేలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందన్నారు. పీఆర్సీ పెరిగినందున వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఆ మేరకు ఆరోగ్య భత్యాన్ని సవరించి రూ.3 వేలు కలిపి రూ.18 వేలు చెల్లిస్తున్నట్లు మంత్రి సురేష్‌ వివరించారు. అయినప్పటికీ కార్మిక సంఘం నేతలు మిగిలిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.21 వేలు వేతనంగా ఇవ్వాలంటున్నారన్నారు. కానీ, కార్మికులు విధుల్లో చేరితేనే వారితో చర్చించాలని, అంతవరకు చర్చలు ఉండబోవని మంత్రి ఆదిమూలపు తేల్చిచెప్పారు.  

విధుల్లో సగం మందికి పైగా కార్మికులు 
సమ్మెకు మద్దతుగా సగంమంది కార్మికులు విధులకు దూరంగా ఉండగా, మిగిలిన సగం మంది విధుల్లో ఉన్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. రెండ్రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ మొత్తం ఒప్పంద కార్మికుల్లో సగం మంది సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తించారు.  

ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు.

ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని కోరారు

పట్టణ ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 
ఇక వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్రంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు.

ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement