సాక్షి, విజయవాడ: ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కల్యాణ్ చదువు గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలన్నారు. ఐరాస వేదికపై పేద విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంపై పవన్ ఆరోపణలు అజ్ఞానానికి నిదర్శనం’’ అంటూ మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు.
టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్ లేదు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తానన్న లోకేష్ మాటలను గుర్తుచేస్తూ.. వాళ్ల నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు అంటూ మంత్రి ప్రశ్నించారు. పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు. యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు. ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్ లేదని తేలిపోయింది. లోకేష్, పవన్‌లకే గ్యారంటీ లేదు. వాళ్లిద్దరూ ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు’’ అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు.
చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా?
Comments
Please login to add a commentAdd a comment