
తాడేపల్లి: చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అని తేలిపోయిందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని, అంటే బాబు కోసమే పవన్ కల్యాణ్ అనే విషయం అర్థమైపోయిందని ఆదిమూలపు పేర్కొన్నారు. ‘ ప్యాకేజీ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరు.వైఎస్సార్‌సీపీతో పోటీ చేసేంత సీన్ పవన్‌కు లేదు. మహిళా మంత్రులపై అసభ్యంగా మాట్లాడటం దారుణం. జగన్‌తో పోరాడటం చేతకాదని పవన్ ముందే ఒప్పుకున్నాడు.
పవన్ రాజకీయాలకు పనికిరాడు
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.పవన్ ఒక ప్యాకేజీ స్టార్ మాత్రమేనని, చంద్రబాబును కలిసి సంక్రాంతి ప్యాకేజీ మాట్లాడుకున్నారన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదని పవన్ ముందే తేల్చిచెప్పాడని, పవన్, చంద్రబాబు, లోకేష్ ఎన్నిసాన్లు దండాలు పెట్టినా 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయమన్నారు మంత్రి జోగి రమేష్. కుప్పంలోనూ చంద్రబాబును ఓడిస్తామన్నారు మంత్రి. అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత తమదని జోగి రమేష్ మరోసారి పేర్కొన్నారు.