సాక్షి, తాడేపల్లి: జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమని అన్నారు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మత్రి జోగి రమేష్. ఎన్నికల్లో ఓడిపోయాక, బాబు అండ్ కో.. హైదరాబాద్‌కు పారిపోతారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడటానికి మీకు సిగ్గు లేదా అని మండిపడ్డారు. చంద్రగిరి నుంచి బాబు, భీమవరం నుంచి పవన్ ఎందుకు పారిపోయారని సూటిగా ప్రశ్నించారు.
సీఎంపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడతారా?:
- విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి జరిగితే, ఆ దాడి ఒక డ్రామా అని, పథకం ప్రకారం చేశారని చంద్రబాబు, లోకేష్‌లు సిగ్గు లేకుండా మాట్లాడతారా?. సంస్కార హీనంగా అవహేళన చేస్తారా? మీరు అసలు మనుషులేనా?
- ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ఐదు కోట్ల మంది ప్రజలపై జరిగిన దాడి.
- మరీ ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, ఇతర వర్గాల పేదలపై జరిగిన దాడిగా ప్రజలంతా చూస్తున్నారు.
- పేదలను నేనున్నాను.. మీకు అండగా ఉంటాను.. అంటూ ప్రతి గడపనూ ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని నరరూప రాక్షసులైన నారా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అవహేళన చేశారు.
- వీళ్లు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులు.
- ఆ బలమైన రాయి కొంచెం కింద కంటికి తగిలి ఉంటే కన్ను పోయేది.
- అదే కణతకి తగిలి ఉంటే ప్రాణమే పోయేది.
- ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ హత్యలకు పురిగొల్పిన చంద్రబాబు అండ్ కో.. ఈ రోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.
- ఎవరు దాడి చేశారు..దాడి చేసిన వారి వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పోలీసుల విచారణలో బయటకు వస్తుంది.
- ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికీ?
- కుట్ర కోణమంతా బయటకు వస్తుంది.. చంద్రబాబు కాస్త వెయిట్ చేయాలి.
- అంత సంఘటన జరిగినా. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయి కనుక ప్రాణాపాయం తప్పింది.
- ఆయనకు తలకు గాయమైందని తెలియగానే కోట్లాది మంది ప్రజలు ప్రార్ధనలు చేశారు. జగనన్నపై ప్రేమ ప్రతి గడపలో కనిపించింది.
జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి
- సిద్ధం సభలతో బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతుంటే విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి.
- జైత్రయాత్రను అడ్డుకునేందుకు, చంద్రబాబు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు.
- దాడి జరగకముందు రోజే.. ముఖ్యమంత్రిపై రాళ్ళతో దాడులు చేయండి.. కొట్టండి అని బహిరంగ సభలో చెప్పాడు.
- ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత సంస్కార హీనంగా మాట్లాడాడో ప్రజలంతా చూశారు.
- నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 45 ఏళ్ల అనుభవం దేనికీ పాతిపెట్టడానికా?
- చంద్రబాబు సభలు పెడితే జనం రాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది.
- మిమ్మల్ని చూడ్డానికి ఎవరు వస్తారు? మీ సొల్లు వినీ వినీ జనం విసుగెత్తిపోయారు.
- జగన్ యాత్రలో కోట్లాది మంది జనం రోడ్ల మీదకు వస్తున్నారు.
- అక్కచెల్లెమ్మలు, యువకులు యాత్రలో పాల్గొంటున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.
- రామోజీ, రాధాకృష్ణా..ఆ వచ్చే ప్రజలను కళ్లు తెరిచి చూడండి.
- జనం రాలేదు..జనం వెళ్లిపోయారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు.
- పేదల పక్షాన జగనన్న ఉన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మం గాక నమ్మం అని చెప్తున్నారు.
చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయింది ఎవరు బాబూ?:
- చంద్రబాబు పెడనలో నిన్న ఇష్టారీతిన మాట్లాడాడు.
- అసలు నీ నియోజకవర్గం చంద్రగిరి. నువ్వు పారిపోయింది కుప్పానికి.
- ఈ ఎన్నికల్లో కుప్పంలో నువ్వు ఓడిపోయి, హైదరాబాద్ పారిపోవడం ఖాయం.
- నీ పార్ట్‌నర్ గతంలో ఎక్కడ పోటీ చేశాడు? భీమవరం, గాజువాకలు వదిలి, ఇప్పుడు పిఠాపురం ఎందుకు పారిపోయాడు?
- పిఠాపురంలో గ్లాసు పగిలిపోతే హైదారాబాద్‌లో షూటింగులు చేసుకుంటాడు.
- చంద్రబాబు కొడుకు లోకేశ్..ఎక్కడ పోటీ చేస్తున్నాడు..? మంగళగిరి నీ సొంతమా?
- దమ్ముగా, ధైర్యంగా ఉన్నాం. జగనన్న సైనికుల్లా ఉన్నాం..ఆయన వెంటే నడుస్తాం.
- ఆయన్ను ఎవరైనా ఏదన్నా అంటే మీ చెమడాలు వలుస్తాం.
- జగన్ ఏం చేశారని మీరు అంతగా కడుపుమంటను ప్రదర్శిస్తున్నారో చంద్రబాబు, పవన్‌లు చెప్పాలి.
- మీకు చేతగానిది ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు.
- జగన్ మా బిడ్డ, మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారు.
- మాకు ఇళ్లు కట్టిస్తున్నాడు..మా పిల్లల్ని చదివిస్తున్నాడు..మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాడని ప్రజలు గడపగడపలో చెబుతున్నారు.
- ఏపీలో జరుగుతున్న అభివృద్ధి-సంస్కరణలు చూసి, దేశమంతా ఏపీౖవైపు చూస్తుంది.
- దిక్కు మాలిన చంద్రబాబు రేపు..దిక్కు లేని వాడు అవ్వబోతున్నాడు.
- మే 13న పోలింగ్ స్టేషన్ కు ఎప్పుడు వెళదామా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.
- ఈ ఇద్దరు మోసగాళ్లు.ఢిల్లీ వెళ్లి బీజేపీతో కలిశారు. కొత్తేముంది..2014లోనూ మీరు ముగ్గురేగా పోటీ చేసింది.
- గెలిచిన తర్వాత ముగ్గురూ తిట్టుకుని.. మూడు ముక్కలయ్యారు.
- పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఇతను పెద్ద పుడింగా..ఇతని వల్ల మేం గెలిచామా? అని తిట్టారు.
- చంద్రబాబేమో, మోడీని, వారి కుటుంబ సభ్యులందరినీ తిట్టాడు.
- ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు కలుస్తారు? సిగ్గుందా?
జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం:
- మీరు బంగాళాఖాతంలో కలపడం కాదు..రేపు ఫలితాల తర్వాత టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతుంది.
- కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కల్యాణ్..ఇద్దరూ ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతున్నారు.
- మనసు పెట్టి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు జగన్ గారు.
- 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల సంకల్పాన్ని మేనిఫెస్టో చేసుకుని ముందుకెళ్లారు.
- ఆ మేనిఫెస్టో ప్రతి గడపకు చేరింది కాబట్టే వారు జగన్ గారిని ప్రతి గుండెలో పెట్టుకున్నారు.
- చంద్రబాబు ఖతం అయిపోబోతున్నాడు. టీడీపీ వారికి చెప్తున్నా.
- చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం.
- ఆ విషయం తెలుసుకుని చాలా మంది ఆ రెండు పార్టీల నుంచి మావైపు వచ్చారు.
- ఇప్పుడు జనసేన, టీడీపీ కాళీ అయిపోతున్నాయి.
- మిగిలిన వారికి కూడా చెప్తున్నా.. జగనన్న వెంట నడవండి. ప్రజా సేవలో మమేకం కండి.
- జగన్ పార్టీ చూడడం లేదు..మతం, కులం ఏమీ చూడటం లేదు.
- చంద్రబాబును నమ్మొద్దు..అతను పెద్ద మోసకారి. పార్టీ పెట్టిన వ్యక్తినే పైకి పంపించిన ఘనుడు.
- చివరికి జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా వెన్నుపోటు పొడిచాడు. అతని సినిమాలు ఆడనివ్వకుండా చేశాడు.
- చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు.
- ఈ పాటికే సర్వేలన్నీ చెప్తున్నాయి. జగన్ గారిది వన్‌సైడ్ వార్ అని స్పష్టంగా చెప్తున్నారు.
- వైఎస్సార్సీపీ 175కి 175 స్థానాల్లో విజయఢంకా మోగించబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment