సాక్షి, విజయవాడ: డా.బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసం జీవో తీసుకొచ్చాం. సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది బలి తీసుకున్నారని మంత్రి సురేష్ అన్నారు.
జీవోకు కట్టుబడి ఉన్నాం: మేరుగ నాగార్జున
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, పేద ప్రజల ప్రాణాల రక్షణకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చిందని, జీవోకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు ఆలోచించారా? అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు.
అడగకుండానే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదు. విగ్రహం కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తామని నాగార్జున వెల్లడించారు.
చదవండి: టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702
Comments
Please login to add a commentAdd a comment