GO No 1
-
AP High court: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది?
సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల సందర్భంగా అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటైన వెకేషన్ కోర్టులో తాను నిర్దేశించిన రోస్టర్‌కు భిన్నంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని బెంచ్ వ్యవహరించడాన్ని తప్పుబట్టిన ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెకేషన్ కోర్టులో ఏం జరిగిందో తమకు స్పష్టంగా తెలుసని, అయితే న్యాయ వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఆ విషయాలను బహిర్గతం చేయడం లేదని తెలిపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న సీజే ధర్మాసనం, ఇంత జరిగిన తరువాత కూడా తాము స్పందించకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రధాన న్యాయమూర్తులు ఇలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. పరిపాలనాపరంగా ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించిన రోస్టర్‌లో రెండు పేరాలు మార్చారని, తద్వారా ఒరిజినల్ రోస్టర్ మారిందని ధర్మాసనం తెలిపింది. అసలు జీవో 1 విషయంలో ఏదో జరిగిపోతోందని రాజకీయ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని ప్రశ్నించింది. అంతగా స్పందించేందుకు ఎవరి ఇల్లు తగలబడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానంపై ఎందుకింత గగ్గోలు పెడుతున్నారని నిలదీసింది. అది ఓ సాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది. జీవో 1 విషయంలో ఇరుపక్షాల వాదనలు పూర్తైనందున తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తుది విచారణ జరిపిన నేపథ్యంలో వారంలో తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ఇదీ నేపథ్యం... రోడ్లు, రోడ్ మార్జిన్లలో బహిరంగ సభల ఏర్పాటును నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకా రామకృష్ణ సంక్రాంతి సెలవుల్లో అత్యవసర కేసులను మాత్రమే విచారించే హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వ్యూహాత్మకంగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ కృపాసాగర్ ధర్మాసనం జీవో 1 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రామకృష్ణ వ్యాజ్యంపై విచారణ జరపాలని సీజే ధర్మాసనానికి స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం వాదనలు విన్నది. ఇదే అంశంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం మంగళవారం పూర్తిస్థాయిలో వాదనలు విన్నది. ఆ అధికారం పోలీసులకు మాత్రమే ఉంది.. కొల్లు రవీంద్ర తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. సభలు, ర్యాలీలు, ధర్నాలు, రోడ్‌షోలు తదితరాల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు మాత్రమే ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ అధికారం మాత్రమే ఉందన్నారు. అంతిమంగా పరిస్థితుల ఆధారంగా డీజీపీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు తమ గళం విప్పకూడదనే ప్రభుత్వం జీవో 1 జారీ చేసిందన్నారు. సహేతుక ఆంక్షలు విధిస్తూ అనుమతులిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. అయితే ప్రభుత్వం ఏకంగా సభలను నిషేధించిందన్నారు. ప్రజలు జీవించే హక్కు, రాజకీయ నేతల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం, భద్రత చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాల వల్లే తొక్కిసలాట ఘటనలు జరిగాయన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు అసంబద్ధ షరతులు విధించారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేపడితే అనుమతినివ్వడమే కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. హక్కులను కాలరాయడం సరికాదు... కన్నా లక్ష్మీనారాయణ తరఫు న్యాయవాది టి.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, నిరసనలను పలు రూపాల్లో తెలియచేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందన్నారు. ఈ హక్కును కాల రాయడం సమాజానికి మంచిది కాదన్నారు. ఎప్పుడో ఒకసారి నిర్వహించే సభలు, సమావేశాలను నిషేధించడం సరికాదన్నారు. అధికార పార్టీ విషయంలో ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీల విషయంలో మరో రకంగా వ్యవహరించడం వివక్షే అవుతుందన్నారు. డీజీపీ ద్వారానే ఉత్తర్వులు ఇవ్వాలి.. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తరఫున సీనియర్ న్యాయవాది రవిశంకర్ వాదనలు వినిపిస్తూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు షోల విషయంలో తెచ్చిన సర్క్యులర్‌ను అన్ని పార్టీలు స్వాగతించాయని చెప్పారు. డీజీపీ స్వతంత్రంగా వ్యవహరించి పరిస్థితులను బట్టి సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? సీపీఐ రామకృష్ణ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవో 1పై విచారణ జరిపే అధికారం వెకేషన్ బెంచ్‌కు ఉందన్నారు. హైకోర్టు నోటిఫికేషన్ ప్రకారం అత్యవసర కేసులను విచారించే విచక్షణాధికారం సీనియర్ వెకేషన్ జడ్జికి ఉందని తెలిపారు. అందులో భాగంగానే వెకేషన్ బెంచ్ జీవో 1పై తమ వ్యాజ్యాన్ని విచారించిందన్నారు. ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి జీవో ఒక్కరోజు కూడా మనుగడలో ఉండటానికి వీల్లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. జీవో ఎమ్మెస్ అయినా, జీవో ఆర్టీ అయినా ప్రభుత్వం తీసుకున్నది సాధారణ నిర్ణయమేనని, దీనిపై రాజకీయ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని ప్రశ్నించింది. ప్రస్తుత చర్యలు సరిపోవడం లేదు... పార్టీలు రోడ్లపై నిర్వహిస్తున్న రోడ్‌షోలు, సభలు, సమావేశాలను నియంత్రించే విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 1 నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకం కాదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులు మరిన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. పరిస్థితులను బట్టే నిర్ణయం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదన్నారు. జీవో 1లో కూడా ఎక్కడా నిషేధం అన్న పదమే లేదన్నారు. సభలు, సమావేశాల కోసం సమర్పించే ప్రతి దరఖాస్తును అప్పటి పరిస్థితుల ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని నియంత్రించే అధికారం పోలీసులకు ఉందన్నారు. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజలు తిరిగే పరిస్థితి లేకుండా చేయడం వల్లే కందుకూరు ఘటన జరిగిందన్నారు. జీవో 1 వల్ల వ్యక్తులకు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసులకు మార్గనిర్దేశం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతినిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఓ రాజకీయ పార్టీ ప్రైవేట్ గ్రౌండ్లో సభ నిర్వహణకు అనుమతి కోరితే మంజూరు చేశామన్నారు. ప్రతిదీ పరిస్థితులను బట్టి ఉంటుందని తెలిపారు. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ దశలో సిద్దార్థ లూత్రా మధ్యంతర ఉత్తర్వుల సంగతి ప్రస్తావించగా.. తుది విచారణ చేపట్టామని, వారంలోపు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఏపీ ప్రభుత్వ జీవో నోం1 పై సుప్రీంకోర్టులో విచారణ
-
జీవో నెం.1పై సుప్రీంకోర్టులో విచారణ.. హైకోర్టుకు ఆదేశాలు
న్యూఢిల్లీ: జీవో నెం.1 పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల23న జీవో నెం 1పై హైకోర్టు విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ జరపాలని పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1పై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో దీనిపై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే పరిధి వెకేషన్ బెంచ్‌కు లేదని కోర్టుకు తెలిపారు. తనకు లేని పరిధిలో వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని వాదించారు. ఉదయం 10:30కు కేసును మెన్షన్ చేసి.. ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజున తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వాదనను తన ఉత్తర్వులలో రికార్డు చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్.. కేసు మెరిట్స్ లోపలికి వెళ్లడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని అన్నారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌లోని ముఖ్యమైన అంశాలు ►బహిరంగ సభలను నిషేధిస్తున్నట్లు జీవోలో ఎక్కడ ఒక పదం కూడా లేదు ►చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోయారు, సభలను అడ్డగోలుగా నిర్వహించారు ►ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ►సభలపై అవసరమైన మేరకు మాత్రమే నియంత్రణలు విధించాం ►జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులలో బహిరంగ సభలు పెట్టొద్దని కోరాం ►ప్రత్యామ్నాయ ప్రాంతాలలో స్థలాలలో సభలు పెట్టుకోవాలని కోరాం -
జీవో నెంబర్-1: హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
సాక్షి, ఢిల్లీ: జీవో నెంబర్-1పై ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఏపీ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
జీవో 1లో నిషేధం అనే పదం లేదు.. రాజకీయ రాద్ధాంతమే..
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విపక్ష పార్టీల నాయకులు జీవో నం.1పై రాజకీయాలు చేస్తున్నారని విద్యావంతులు, న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత స్వార్థ ప్రయోజనాలకు 11 మంది అమాయకులు బలైతే పోలీసులపై నిందలు వేయడం ఏమిటని నిలదీశారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచి్చతో 29 మంది మృత్యువాత పడితే అందుకు ప్రజలదే బాధ్యతంటూ టీడీపీ నిస్సిగ్గుగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాస్తవానికి మన దేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణంతో పాటు చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివేనని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలను రోడ్లపై కాకుండా అనువైన ప్రదేశంలో తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1పై శుక్రవారం విజయవాడలో చర్చా వేదిక నిర్వహించారు. పౌర హక్కులపై ఏపీ ఇంటెలెకు్చవల్ అండ్ సిటిజన్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో పి.విజయబాబు అధ్యక్షతన ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్యులను సమిధలుగా మారుస్తున్నారని సిద్ధార్థ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరహక్కులే ప్రధానమని, వాటి పరి రక్షణకు చట్టాలు చేయడం ప్రభుత్వాల బాధ్యతని విజయబాబు పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1లో ఏముందో తెలుసుకోకుండా ఓ వర్గం మీడియా భావ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. రోడ్లు, ఇరుకైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించరాదని అందులో ఉంది. సభలు నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతి, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రోడ్లు ఉన్నది ప్రజలు తిరిగేందుకేగానీ సభల కోసం కాదని కోర్టు పేర్కొంది. రోడ్లను రాజకీయ క్రీడా మైదానాలుగా మారుస్తున్న కొందరు నాయకులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు విష ప్రచారం చేస్తున్నారు. ప్రాథమిక హక్కులనేవి రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినా కమ్యూనిస్టులు స్పందించలేదు. కారకులను వదిలేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టిన గోడ కూల్చినందుకే ఉద్యమ స్థాయిలో స్పందించిన జనసేన అధినేత 11 మంది అమాయకులు చనిపోతే ఎందుకు స్పందించడం లేదు? – పి.విజయబాబు, ఎపిక్ ఫోరం అధ్యక్షుడు చట్టంపై వక్రభాష్యం ఏదైనా దుర్ఘటన జరిగి సామాన్యులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1తో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. ఈ చట్టం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. తన చర్యలతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా హక్కులను వినియోగించుకుంటున్నానని చెప్పే వారిని ఏమనాలి? రోడ్లపై ర్యాలీలు నిర్వహించరాదని చట్టంలో లేదు. సభలు మాత్రమే వద్దని అందులో పేర్కొన్నారు. – జి.రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే.. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. అలాంటి వాటిలో 1861 పోలీస్ చట్టం ఒకటి. జీవో నం.1 పోలీస్ చట్టానికి అనుగుణంగానే ఉంది. ఇందులోని నిబంధనలు ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఈ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారు. బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్ల బాధ్యత నిర్వాహకులదే. సమయం, ప్రదేశం, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహిస్తారు? వలంటీర్ల ఏర్పాటు లాంటి వివరాలతో పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిర్దిష్ట సమయానికి నిర్వహించలేకపోతే కారణాలను వివరిస్తూ మరోసారి అనుమతి పొందాలి. పోలీసులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చట్టంలో ఉంది. జీవో నం.1లో సభలపై నిషేధం గానీ, అభ్యంతరకర అంశాలుగానీ లేవు. – ఏఎస్ఎన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పీ జీవో వచ్చాక కూడా సభలు జరిగాయ్ ఓ ఘటన జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1 తెచ్చింది. ఇది సభలను, ర్యాలీలను నిషేధిస్తూ చేసింది కాదు. ఈ చట్టం చేశాక ఒంగోలులో బాలకృష్ణ, విశాఖలో చిరంజీవి సినిమా సభలు జరిగాయి. తర్వాత పవన్ కళ్యాణ్ సభ కూడా జరిగింది. ఒకవేళ జీవోలో నిషేధం అని ఉంటే ఈ సభలు జరిగేవా? ప్రతిపక్ష పార్టీలు స్వలాభం కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఈ చట్టంలో ఏముందో తెలియదంటే అవివేకమే అవుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది రోడ్లను దిగ్బంధించే హక్కు లేదు నిరసనలు తెలిపేందుకు, బహిరంగ సభల నిర్వహణకు ప్రత్యేక వేదికలుంటాయి. అక్కడ మాత్రమే చేపట్టాలి. రోడ్లను దిగ్బంధించి సభలు నిర్వహించే హక్కు ఎవరికీ లేదని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దండి మార్చ్ సైతం మహాత్మాగాంధీ 78 మందితోనే నిర్వహించారు. ఇప్పుడు రాజకీయ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు, స్వలాభం కోసం రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు పునరావృతం కాకుండా సరిదిద్దే బాధ్యత ప్రభుత్వానిది. అందుకోసమే జీవో నం.1 జారీ చేశారు. అందులో సభలు, ర్యాలీలను నిషేధించలేదు. రోడ్లపై సభలు వద్దని మాత్రమే పేర్కొన్నారు. ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించే సభలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ జీవోను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ యువకుడు హైకోర్టుకు వెళితే దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. కానీ నాలుగు రోజుల్లోనే ఈ జీవోను రద్దు చేయాలని ఒకరు ఆశ్రయిస్తే ఇది బ్రిటీష్ కాలం నాటి చట్టమని ఆక్షేపించింది. వాస్తవానికి మన న్యాయ వ్యవస్థ నిర్మాణం, చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. – కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దు: మంత్రులు
సాక్షి, విజయవాడ: డా.బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసం జీవో తీసుకొచ్చాం. సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది బలి తీసుకున్నారని మంత్రి సురేష్ అన్నారు. జీవోకు కట్టుబడి ఉన్నాం: మేరుగ నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, పేద ప్రజల ప్రాణాల రక్షణకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చిందని, జీవోకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు ఆలోచించారా? అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు. అడగకుండానే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదు. విగ్రహం కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తామని నాగార్జున వెల్లడించారు. చదవండి: టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702 -
ఈనెల 23 వరకు జీవో నెం.1 పై హైకోర్టు తాత్కాలిక స్టే
-
జీవో నెం.1పై తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 23 వరకు జీవో నెం.1పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
జీవో నంబర్-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీవో నంబర్-1పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రామకృష్ణ కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌ను విచారించే అధికారం లేదని ఏజీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పిల్‌ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
ఆ విషయంలో టీడీపీ వెనకడుగు.. ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ఒకటిపై విపక్షం ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు? ఇది కొంత ఆశ్చర్యం కలిగించే అంశమే. మామూలుగా అయితే ప్రభుత్వం ఏ జిఓ విడుదల చేసినా, మరుసటి రోజుకల్లా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడడం రివాజుగా మారింది. ఎక్కువ సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకురావడంలో తెలుగుదేశం సఫలం అవుతూ వస్తోందన్న భావన ఉంది. ఈ విషయంలో టీడీపీకి ఉన్న శక్తి సామర్ధ్యాలను చూసి అంతా నివ్వెరపోయే పరిస్థితే. కాని అదే సమయంలో టీడీపీ లేదా ఆ పార్టీ మద్దతుదారులు, వేసిన వ్యాజ్యాల వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ప్రజలు అభిప్రాయపడుతుండడంతో టీడీపీ ఆశించిన విధంగా ఆ పార్టీకి అంత రాజకీయ లబ్ది చేకూరలేదనే చెప్పాలి. ఉదాహరణకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంగ్ల మీడియంపై వ్యాజ్యం పడడంపై పేద వర్గాలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజధాని అంశంలో అయితే బహుశా దేశంలోనే ఎక్కడా వేయనన్ని పిటిషన్లు పడ్డాయి. వీటిలో అత్యధికం టీడీపీ మద్దతుతో పడినవే అన్న సంగతి బహిరంగ రహస్యమే. అమరావతి రైతుల పేరుతో తలపెట్టిన పాదయాత్ర వల్ల ఉద్రిక్తతలు వస్తాయని పోలీస్ శాఖ అభిప్రాయపడినా, హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోగలిగారు. పోలీసులు అంచనా వేసినట్లే ఆ పాదయాత్రలో పాల్గొన్నవారు ఎన్నిసార్లు ఉద్రిక్తత సృష్టించింది అంతా గమనించారు. ఆ పాదయాత్రలో రైతుల కన్నా, వారి ముసుగులో టీడీపీ వారే పాల్గొన్నట్లు వెల్లడైంది. హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను వీరు పట్టించుకోవడం లేదని రుజువు అయింది. చివరికి పాదయాత్రను విరమించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇలా పలు సందర్భాలలో న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించరాదని, పర్మిషన్ తీసుకునే రోడ్డు షో వంటివి జరపాలని ఆదేశాలు ఇవ్వగా, దానిపై టీడీపీ, జనసేన, వామపక్షాలు నానా రాద్దాంతం చేస్తున్నాయి. వాటిని ధిక్కరిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పంలో హై డ్రామా చేశారు. అయినా హైకోర్టుకు వెళ్లలేదు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ జిఓ పై హైకోర్టుకు వెళితే కొట్టివేస్తారని అన్నారు. మరి ఆయనకూడా ఇప్పటికే పలు అంశాలపై కోర్టుకు వెళ్లారు కదా!. కాని దీనిపై ఇంతవరకు ఎందుకు వెళ్లలేదన్నది చర్చనీయాంశం అవుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉండవచ్చు. బహుశా న్యాయ స్థానం వారు జిఓని సమర్దిస్తూ ఆదేశాలు ఇస్తే తమ ప్రచారం అంతా వృథా అవుతుందని అనుకోవచ్చు. రోడ్లపై సభల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరితే దానిని వాదించుకోవడం కష్టం కావచ్చు. గతంలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుకూలంగా నిర్ణయం వచ్చినా, ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలలో హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. వాటిని పాటించడం సాధ్యం కాదని యాత్రనే విరమించుకోవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా గైడ్ లైన్స్ ఇస్తే విపక్షాలకు అది మరింత ఇబ్బంది కావచ్చు. కోర్టుకు వెళ్లే బదులు ప్రభుత్వం ఏదో అణచివేస్తోందని ప్రచారం చేస్తే దానివల్ల ఏమైనా రాజకీయ లబ్ధి వస్తుందేమోనన్న ఆశ వారికి ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలతో టీడీపీ, జనసేన లేదా ఇతర విపక్ష పార్టీలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లి ఉండకపోవచ్చన్నది నిపుణుల అంచనాగా ఉంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలలో పదకుండు మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం రోడ్లపై సభల నిర్వహణకు ఆంక్షలు పెట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలలోనే ఈ తొక్కిసలాటలు జరిగాయి. కందుకూరులో డ్రోన్ షూటింగ్ కోసం ఇరుకు సందులోసభ నడిపే యత్నం చేయడం, గుంటూరులో సభకు వచ్చేవారికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున పేదలు తరలి వచ్చి తొక్కిసలాటకు గురయ్యారు. ఇవన్ని టీడీపీకి తీవ్ర నష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేనలు కొత్త డ్రామాలకు తెరదీశాయి. జిఓ వన్ ఆధారంగా తమ గొంతు నొక్కుతున్నారన్న ప్రచారానికి దిగాయి. చదవండి: చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగింది? అసలు సమస్య అదేనా? చంద్రబాబు, పవన్‌లు ఒకరికొకరు సంఘీభావం ప్రకటించుకునే సన్నివేశాన్ని ప్రజల ముందుంచారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. దీనిపై ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్పందించలేకపోయారు. ఈ తొక్కిసలాటకు గురైనవారిని పరామర్శించకుండా, ఆ ఘటనకు కారణమైన చంద్రబాబు నాయుడును పరామర్శించడం విడ్డూరంగానే ఉంటుంది. అయినా దీనిని ఒక వ్యూహంగా వారు భావిస్తున్నారు.కందుకూరు, గుంటూరు విషాదాలను పక్కదారి మళ్లించడానికి ఈ డ్రామాలు నడుపుతున్నారు. వీటిని ప్రజలు నమ్ముతారా? అసహ్యించుకుంటారా? -హితైషి -
చట్ట ప్రకారమే జీవో నెంబర్ 1 : ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్
-
జీవోను చంద్రబాబు, పవన్ తప్పుపట్టడం సిగ్గుచేటు: ఎంపీ మిథున్ రెడ్డి
-
ప్రజలపై బాధ్యతతోనే జీవో నెం1 తీసుకువచ్చాం: మంత్రి బొత్స సత్యనారాయణ
-
రోడ్లపై సభలు వద్దంటే రభసా?
సాక్షి, అమరావతి: అసలు ఆ జీవోలో తప్పేమయినా ఉందా? రోడ్లపై సభలు, సమావేశాలను వద్దనటం మంచిదా... చెడ్డదా? అది కూడా కావాలని ఇరుకు రోడ్లో సభ నిర్వహించడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయాక... అటువంటి సంఘటనలు ఇక పునరావత్తం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కదిలి ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయటం సమంజసం కాదని అనగలమా? ఇవేమీ ఒక పార్టీనో, ఒక నాయకుడినో దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఉత్తర్వులు కాదు కదా?!. రోడ్లపై సభలు పెట్టకూడదన్నది అన్ని పార్టీలకూ, అందరు నాయకులకూ సమానంగా వర్తించే అంశం. ఇది తప్ప వేరే కార్యక్రమాలేమైనా రోడ్లపై చేసుకోవాలంటే దానికి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటే చాలని ఆ ఉత్తర్వుల్లోనే ఉంది. మరిప్పుడు దేన్ని తప్పు బడుతున్నారు? రోడ్లపై సభలు, సమావేశాలు వద్దనటాన్నా? లేక మిగతా కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలనటాన్నా? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ దుష్ప్రచారానికి దిగుతున్నారనేది మరోసారి తేటతెల్లం కావటం లేదా? ఇన్ని మరణాలు సంభవించాక కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఉంటే చంద్రబాబుకు వంత పలికే ఇతర ప్రతిపక్ష పార్టీలు, మీడియా దీన్ని ఆక్షేపించకుండా ఉంటాయా? రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల భద్రతతో ఏమాత్రం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏమనుకోవాలి? ఇరుకు రోడ్డులోకి కావాలని వాహనాన్ని పోనిచ్చి సభ నిర్వహించి, 8 మంది ప్రాణాలు బలితీసుకున్న ప్రతిపక్ష నాయకుడిలో కాస్తయినా పశ్చాత్తాపం కనిపించాలి కదా? పదుల సంఖ్యలో జనం గాయపడినా కూడా ఏ మాత్రం బాధపడకుండా రోడ్లపై మరో సభకు తయారై... దాన్ని ఎందుకు అడ్డుకుంటారంటూ రభస చేయటం సరైనదేనా? ఎందుకిచ్చారు ఈ జీవో..? ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో అక్షరం కూడా నిజం లేదన్నది యథార్థం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి పబ్లిసిటీ దాహంతో నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై నిర్వహించిన సభలో 8 మంది దుర్మరణం చెందారన్నది విస్మరించలేని విషాదం. నాలుగు రోడ్ల కూడలిలో కాస్త విశాలమైన ప్రాంతంలో సభ నిర్వహిస్తామని ముందుగా అనుమతి తీసుకున్న చంద్రబాబు... కేవలం తన సభకు వచ్చిన జనాన్ని తక్కువ మందిని కూడా రద్దీరద్దీగా బీభత్సమైన స్థాయిలో చూపించాలన్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. అందుకోసం డ్రోన్లతో షూటింగ్‌కు సిద్ధమయ్యారు. తీరా సభా స్థలమయిన ఎన్టీఆర్ సర్కిల్‌కు వచ్చేసరికి జనం అనుకున్నంతగా లేరని భావించారు. ఆ విశాలమైన రోడ్లోంచి తన వాహనంతో సహా కాన్వాయ్‌ని మరో 50–70 మీటర్లు ముందుకు... ఇరుకు రోడ్లోకి పోనిచ్చారు. ఇరుకు రోడ్డులో ఫ్లెక్సీలు కట్టడంతో మరింత కుదించుకుపోయింది. అన్ని వాహనాలు అంత చిన్న రోడ్లోకి దూసుకు రావటంతో... అప్పటిదాకా అక్కడ నిల్చుని ఉన్న జనం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు కింద పడిపోయారు. వారిని తొక్కుకుంటూనే మిగిలిన వారు వెనక్కి వెళ్లారు. దీంతో దాదాపుగా ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇరుకు రోడ్లో తక్కువ జనం వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూట్ చేస్తే భారీగా వచ్చినట్లు కనిపిస్తారని, దాన్నే ప్రచారానికి వాడుకోవచ్చని బాబు వేసిన వ్యూహం బెడిసికొట్టడమే ఈ నిండు ప్రాణాలను బలితీసుకుందని చెప్పటానికి వేరే ఏమీ అక్కర్లేదు. అసలు ఆ జీవోలో ఏముంది? ఇదిగో... ఈ సంఘటన నేపథ్యంలోనే ప్రజల ప్రాణాలను కాపాడటం తన బాధ్యతగా భావించి ప్రభుత్వం జీవో నెంబర్–1 జారీ చేసింది. పబ్లిసిటీ కోసం ఇరుకు రోడ్లలో జనాన్ని షూట్ చేసి.. మరిన్ని మరణాలకు కారణమయ్యే సంఘటనలేవీ జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోలో... సభలు నిర్వహించకూడదని ఎక్కడా చెప్పలేదు. కేవలం రోడ్లపై మాత్రమే నిర్వహించవద్దని పేర్కొన్నారు. మైదానాలు, ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవచ్చు. అందుకోసం గ్రామ, మండల, మునిసిపాలీటీల పరిధిలో ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించాలని కూడా అధికార యంత్రాంగాన్ని స్వయంగా ప్రభుత్వమే ఆదేశించింది. అంటే ఏదైనా గ్రామంలో గానీ పట్టణంలో గానీ రోడ్లపై మాత్రమే సభలు నిర్వహించకూడదు. అక్కడి కాలేజీ మైదానాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చు. అందుకు దరఖాస్తు చేస్తే పోలీసులు అనుమతిస్తారు. కాబట్టి ప్రభుత్వం జారీ చేసిన జీవో సభల నిర్వహణకు ఏ విధంగానూ అడ్డంకి కాదు. వీటన్నిటికీ తోడు... రోడ్లపై సభలు వద్దన్న నిబంధనకు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం మినహాయింపులిచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు నిర్వహించాలని భావిస్తే అందుకు కారణాలను వివరిస్తూ జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సభ నిర్వహించే సమయం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, హాజరయ్యే జనం, ఇతర ఏర్పాట్ల వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి. వాటిని పరిశీలించి పోలీసులు సంతృప్తి చెందితే సభ నిర్వహణకు షరతులతో అనుమతినిస్తారు. అనుమతి కోసం పేర్కొన్న షరతులకు విరుద్ధంగా సభను నిర్వహిస్తే మాత్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
'ఏపీ రాజధాని ప్రాంతం 122 కిలోమీటర్లు'
-
ఏపీ రాజధాని ప్రాంతం 122 కిలోమీటర్లు
హైదరాబాద్: 122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతంగా గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మరో 7068 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా గుర్తించామని తెలిపింది. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌పై రూపొందించిన రూల్స్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 1 జారీ చేసింది. అలాగే విజయవాడ - గుంటూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్స్ రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో మరో మూడు మెగా సిటీలతోపాటు 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని తెలిపింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ల్యాండ్ పూలింగ్ చేపడతామని వివరించింది. ల్యాండ్ పూలింగ్ కోసం విధివిధానాలు ఖరారు చేసేందుకే మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటైందని పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించిన సంగతిని గుర్తు చేసింది. ప్రణాళిక, సమన్వయం, అమలు, పర్యవేక్షణ, ఆర్థిక తీరు, నిధులు, ప్రమోటింగ్ కోసం సీఆర్డీఏ ఏర్పాటు చేసినట్లు విశదీకరించింది. 2014, డిసెంబర్ 30 నుంచి సీఆర్డీఏ అమల్లోకి వచ్చిందని తెలిపింది.స్వచ్ఛంద పద్దతిలో ల్యాండ్ పూలింగ్ కోసం సీఆర్డీఏకు అధికారాలు కట్టబెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.