
సాక్షి, అమరావతి: సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 23 వరకు జీవో నెం.1పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment