
సాక్షి, విజయవాడ: మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మే 16కి వాయిదా పడ్డాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీ సెట్ జూన్ 10కి వాయిదా వేశారు. జూన్ 10 నుంచి 14 ఏపీ పీజీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఏపీ ఆర్ సెట్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment